“రిథమ్ అండ్ మెలడీస్” ఆధ్వర్యంలో జరిగిన స్వరాంజలి కార్యక్రమమునకు అపూర్వ స్పందన

1791

అమెరికా, లాస్ ఏంజీల్స్ పట్టణం లోని ఇర్విన్(Irvine) నగరం లో 9వ ఘంటసాల ఆరాధనోత్సవాలు మరియు 6వ యస్.పి.  బాలు సంగీత్సోవాలను “రిథమ్ అండ్ మెలడీస్” సంస్థ (Rhythm & Melodies) ఘనంగా నిర్వహించింది.

గత రెండేళ్లుగా.. సంగీతమే సేవగా, సేవే సంగీతంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న “రిథమ్ అండ్ మెలడీస్”      స్వచ్ఛంధ సంస్థ రూపకర్త సుధీర్ కోట గారు,  తమ పాటల కచేరితో సేకరించిన విరాళలతో ఎంతోమంది అభాగ్యుల, వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.

విదాత చిన్న చూపు చూసిన దాతల ఉదార హృదయంతో  మానసిక, భౌతిక వికలాంగులైన చిన్నారుల  జీవితాల్లో క్రొత్త  ఆశలు చిగురింపజేస్తున్న స్వచ్ఛంధ సంస్థ  “వెగేసన పౌండేషన్” (Vegesna Foundation,India). గత ఇరవై ఎనిమిది సంవత్సరములుగా “వికలాంగుల సేవయే మాధవ సేవ” అని తమ నిరంతర సేవలు అందజేస్తున్న వెగేసన పౌండేషన్  స్ధాపకులు  కళాబ్రహ్మ , శిరోమణి  డా.శ్రీ వంశి  రామరాజు గారు సుప్రసిద్ధ సేవకులు,  విశాల హృదయులు, అనితర సాధ్యులు, మరియు మనషుల్లో మంచి మనసున్నమహారాజు.  రిథమ్ అండ్ మెలడీస్  ప్రెసిడెంట్ సుధీర్ కోట గారు ఈ మ్యూజికల్ నైట్ సందర్భంగా సేకరించిన 10,000 డాలర్ల విరాళలను మన “వెగేసన పౌండేషన్” అధినేత డా.శ్రీ వంశి  రామరాజు గారికి  అందజేశారు.

Rhythma & melody swaranjali in Los Angeles (1) Rhythma & melody swaranjali in Los Angeles (2) Rhythma & melody swaranjali in Los Angeles (3)

ఈ ప్రదర్శనలో భాగంగా సుప్రసిద్ధ గాయకులు,  సంగీత విధ్వాంసులు పద్దెనిమిది రకాల సంగీత వాయిద్యాలను వాయించగల సత్తా వున్న.. నంది అవార్డు గ్రహీత వినోద్ బాబు గారు మరియు నాలుగేళ్ళ ప్రాయంలోనే తన గాన ప్రస్ధానాన్ని మొదలుపెట్టి ఎన్నోసాంస్కృతిక  కార్యక్రమాలు చేసిన గాన కోకిల శారద ఆకునూరి  గారు పాల్గోని, తమ గానమృతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న డా. భారతి గారిని ఈ సందర్భంగా డా.శ్రీ వంశి  రామరాజు గారు, సుధీర్ కోట గారు సన్మానించారు.

మధువాణి, సుధీర్ కోట గారిని  సతిసమేతంగా వారి సేవ తత్పరతకు గాను డా.శ్రీ వంశి  రామరాజు గారు తమ కృతజ్ఞతలు తెలుపుతూ చిరు సన్మానం చేసారు.

ఈ కార్యక్రమానికి వక్త గా నిర్వహించిన రాజలక్ష్మి చిలుకూరి గారు తన మాటల గారడితో  అందరిని అబ్బురపరిచారు.

“రిథమ్ అండ్ మెలడీస్” సంస్థ అధినేత సుధీర్ కోట గారు, శారద ఆకునూరి గారికి, వినోద్ బాబు గారికి, డా.శ్రీ వంశి రామరాజు గారికి కృతజ్ఞత పూర్వకంగా జ్ఞాపికలను అందజేశారు. మరియు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి సహకరించిన రిథమ్ అండ్ మెలడీస్ కార్యకర్తలందరికి, ఈ కార్యక్రమంలో తమ వంతు సాయం చేసిన  చిన్నారులకు కూడ  కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రిథమ్ అండ్ మెలడీస్ బృందం నుండి వర్మ అల్లూరి, భారతి వాయువేగుల, శివనాధ్ పారనంది, ఉష ఎడవల్లి, సుధీర్ కోట, స్వరూప మామిడి, విఙయ కనవలె, వైభవ్ ఎక్బోతే, గిరిఙ అడితం, రఘు అడితం, మధువాణి కోట, కృష్ణ సమంతుల,  మరియు బాల సిసింద్రులు శ్రీకర్ కస్తూరి, కౌశిక్ కస్తూరి,  తమ గానంతో ప్రేక్షకులను అలరించారు.