తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జరిగిన మొదటి కతర్ తెలంగాణ ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలు

1594
దోహా,తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జరిగిన మొదటి కతర్ తెలంగాణ ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలు విజయవంతంగా ముగిసాయి. కతర్ లోని పది జట్లు టైటల్కోసం పోటీ పడగా,రసవత్తరమైన ఫైనల్ లొ తెలుగు టైగర్స్ జట్టు కతర్ మాస్టర్స్ జట్టుని ఓడించి టైటల్ కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా తెలుగు టైగర్స్ జట్టు సభ్యుడు రాజు గారు నిలిచారు.
ముఖ్యాతిధులుగా విచ్చేసిన శ్రీమతి శ్రీ. అనుపమ గారు మరియు ఇతర ప్రముఖులు తెలంగాణా గల్ఫ్ సమితి గురించి మాట్లాడుతూ చాల మంచివుద్దేశంతో గొప్ప కార్యక్రమం చేసారని నిర్వాహకులైన ప్రసాద్ గడీలా (పాప్యులర్ ట్రేడింగ్ కంపనీ) మరియు యోగేష్ గాదె (శ్రవణ్ ఫుడ్ స్టఫ్) గారిని ప్రత్యేకంగా అభినందించారని తెలంగాణ గల్ఫ్ సమితి ప్రతినిధి శ్రీ శ్రీధర్ ఆబ్బగౌని గారు తెలిపారు.
Qatar Telangana Premier league 2015 (1) Qatar Telangana Premier league 2015 (2) Qatar Telangana Premier league 2015 (3)