టాక్ అధ్యక్షురాలిగా పవిత్ర కంది

1212
ఇటీవల లండన్ లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించి స్థాపించిన తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK – టాక్ ) అధ్యక్షురాలిగా పవిత్ర రెడ్డి కంది, అడ్వైసర్ బోర్డు చైర్మన్ గా గోపాల్ మేకల నియమితులయ్యారు.
సంస్థ అధ్యక్షురాలిగా నియమితులైన సంధర్భంగా పవిత్ర రెడ్డి మాట్లాడుతూ, తన పై నమ్మకం వుంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపి, నా గత అనుభవం తో పాటు సంస్థ సభ్యులందరి సహాకారంతో తెలంగాణ సమాజానికి ఆశించిన సేవలందిస్తానని అలాగే త్వరలో పూర్తి కార్యవర్గం ఏర్పాటు చేసుకొని సంస్థ భవిష్యత్తు, చేసే కార్యక్రమాల క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు.
ఈ సందర్బంగా పలువురు సభ్యులు పవిత్ర రెడ్డి ని అభినందించి తమ సహాయ సహకారాలు ఎల్లపుడు వుంటాయని తెలిపారు.
pavitra-reddy-kandi