కన్నుల పండుగగా జరిగిన దక్షిణ కాలిఫోర్నియా పాఠశాల వసంతోత్సవము

1206

దక్షిణ కాలిఫోర్నియాలో ప్రారంభమైన పాఠశాల తెలుగు తరగతులు విశేష స్పందన మద్య  మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పాఠశాల వసంతోత్సవములో దక్షిణ కాలిఫోర్నియాలోని వివిధ పాఠశాలల బోధనా కేంద్రాల విద్యార్ధులు వసంతోత్సవములో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. యాభై మందికి పైగా విద్యార్దులు, సుమారు 200 మంది తల్లి తండ్రులు, వారి స్నేహితులు మరియు బంధువులు ఈ వసంతోత్సవము కార్యక్రమములో  పాల్గొన్నారు. పాఠశాల విధ్యార్ధులు ఈ కార్యక్రమంలో వివిధ సంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.

పాఠశాల తెలుగు తరగుతుల ద్వారా అమెరికాలో నివసిస్తున్న తెలుగు పిల్లలకు భాషనే కాకుండా తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను  పరిచయం చేయాలనీ, మరియు సంవత్సర కాలంగా తెలుగు పిల్లలు నేర్చుకున్న భాష, సంస్కృతులను ప్రదర్శింప చేసేందుకు వేదికగా పాఠశాల వసంతోత్సవాన్ని మే 7 న, ఇర్వైన్, సీనియర్ కేంద్రములోని సభా మందిరంలో  నిర్వహించడం  జరిగింది.  ఇర్వైన్ అడుగు ఆడ పిల్లల భాగవన్నామ స్మరణతో వసంతోత్సవము మొదలై, పలుకు విద్యార్ధుల జన గణ మన జాతీయ గీతాలపనతో సుమారు మూడు గంటల పాటు  ఏక ధాటిగా ఈ వసంతోత్సవ కార్యక్రమాలు కొనసాగాయి.

  ఈ వసంతోత్సవములో పిల్లలచే జానపద నాటికలు, ఏక పాత్రలు, గేయాలు, లఘు హాస్య నాటికలు, అత్తా కోడళ్ళ హాస్య సంభాషణలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 5 సంవత్సరాలు కూడా నిండని తారంగం పిల్లలచే దురాశ దుఃఖానికి చేటు మరియు బంగారు గొడ్డలి లాంటి నాటికలు ప్రదర్శించటం ఈ వసంతోత్సవములో విశేషం. పలుకు విద్యార్ధుల మర్యాద రామన్న నాటిక, అడుగు విద్యార్ధుల తెనాలి రామకృష్ణుడి నాటికల ద్వారా, తెలుగు జానపదాలను ప్రదర్శించారు. పలుకు విద్యార్ధుల తెలుగు తరగతి, అత్తా కోడళ్ళు, గురువు విద్యార్ధుల హాస్య సంభాషణలు ఆహుతులను నవ్వుల్లో ముంచెత్తాయి. పలుకు విద్యార్ధులు పాడిన జయ జయ ప్రియ భారత, తెలుగు తల్లి వంటి గేయాలతో, చిన్న పిల్లల వేషధారణలతో  కార్యక్రమం ఆధ్యంతము ఎంతో ఆసక్తి కరంగా సాగింది

SoCalPaatasalaVasanthothsvama (1) SoCalPaatasalaVasanthothsvama (2) SoCalPaatasalaVasanthothsvama (3) SoCalPaatasalaVasanthothsvama (4) SoCalPaatasalaVasanthothsvama (5) SoCalPaatasalaVasanthothsvama (6) SoCalPaatasalaVasanthothsvama (7) SoCalPaatasalaVasanthothsvama (8) SoCalPaatasalaVasanthothsvama (9) SoCalPaatasalaVasanthothsvama (10) SoCalPaatasalaVasanthothsvama

ఈ సందర్భంగా దక్షిణ కాలిఫోర్నియా పాఠశాల ప్రాంతీయ డైరెక్టర్ శ్రీధర్ సాతులూరి మాట్లాడుతూ పాఠశాల విద్యా సంవత్సరానికి మరియు వసంతోత్సవానికి సాయమందించిన లేక్ ఫారెస్ట్, ఆలోహా వారికి, ఎల్‌.ఏ. తెలుగు వారికి, ఇయానా వారికి, దోసా ప్లేస్, టస్టిన్ వారికి, ఉపాధ్యాయులు మరియు కార్యకర్తలకు తమ కృతజ్ఞతలను తెలిపారు. పాఠశాల పై నమ్మకంతో తమ వద్దకు పిల్లలను పంపుతున్న తల్లి తండ్రులకు తమ ధన్యవాదా లను తెలిపారు.  ఇంకా ఈ కార్యక్రమంలో తానా లాస్  ఏంజిలేస్ సమన్వయ కర్త సురేశ్ కందేపు, మొదటి సంవత్సరాన్ని విజయవంతగా ముగిస్తూ, వసంతోత్సవాన్ని ఎంతో వేడుకగా నిర్వహించిన పాఠశాల బృ0దానికి తమ అభినందనలు తెలియచేస్తూ, తానా తరుపున తమ సహాయ సహకారాలను ఎల్లప్పుడు అందిస్తామని చెప్పారు.

కార్యక్రమంలో విద్యార్ధులకు, పాఠశాల వారి ధృవీకరణ పత్రాలను, మరియు ఇయానా వారు అందించిన మెమెంటో లను ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించారు. చివరగా అచ్చ తెలుగు భోజనంతో  వసంతోత్సవానికి ముగింపు పలికారు.