షార్లెట్ లో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

2037

శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది నాడు నార్త్ కెరొలినా, షార్లెట్ లో శ్రీమతి జ్యోతిర్మయి కొత్త, శ్రీ రఘునాథ్ కొత్త స్థాపించిన ‘పాఠశాల’ ఆరవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సుమారుగా నాలుగు వందలమంది ఈ వార్షికోత్సవానికి హాజరవగా అందులో నూట ఐదు మంది విద్యార్ధులు, పంతొమ్మిది మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల వ్యవస్థాపకులు, మరియు ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జ్యోతిర్మయి కొత్త, శ్రీ రఘునాధ్ కొత్త అనివార్య కారణాల వల్ల వార్షికోత్సవ కార్యక్రమానికి రాలెకపొయారు. పాఠశాల పూర్వ విద్యార్ధుల ప్రార్ధనా గీతంతో ఈ కార్యక్రమం మొదలైంది. పాఠశాల వార్షికోత్సవ కార్యనిర్వాహకురాలు మంజుల సూరి ముఖ్యఅతిధి శ్రీ ఫణి కుమార్ డొక్కా గారిని వేదిక మీదకి ఆహ్వానించిగా, వారు దీప ప్రజ్వలన గావించారు. శ్రీ ఫణి కుమార్ గారు ఉపాధ్యాయుల కృషిని అభినందించి వారికి బహుమతి ప్రధానం చేసారు. ఫణికుమార్ గారికి, వార్షికోత్సవ సమన్వయ కర్తలు శ్రీమతి వేలూరి రాధ, శ్రీ డోకి శ్రీనివాస్, శాలువా చందనాది సత్కారాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి ఉషా పారుపూడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉపాధ్యాయులు విధ్యార్థులకు జ్ఞాపికలు మరియు ప్రశంసా పత్రికలు అందచేసారు.

 

పాఠశాల వార్షికోత్సవ బృంద సభ్యులు, శ్రీమతి మంజుల సూరి, శ్రీమతి దేవినేని నీలిమ, శ్రీ డోకి శ్రీనివాస్ పాఠశాల పురోగాభివృద్దికి తమ హర్షం వ్యక్తం చేసారు. విద్యార్ధులు ‘నడవడిక’, ‘మమ్మల్ని కాపాడండి’, ‘శ్రీరామ విజయం’ నాటికలు, పాటలు, హరిదాసు, బుర్రకథ, సోది, పంచాంగ శ్రవణం వంటి కార్యక్రమాలతో తెలుగు భాషలో వారి ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఆహుతులను అలరించారు. పాఠశాల విద్యార్ధుల తల్లిదండ్రులు తమ స్వహస్తాలతో చేసిన వంటకాలతో ఉపాధ్యాయులకు, అతిధులకు షడ్రసోపేతమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. కొలంబియా నుండి వచ్చిన సత్య కడాలి గారు, పాఠశాల ననుసరించి అక్కడి తెలుగు వారి పిల్లల కోసం తెలుగు తరగతులు మొదలు పెట్టిన తీరు వివరించారు. ప్రముఖ కవి, శ్రీ విన్నకోట రవిశంకర్ గారు “భాషను ఎలా బోధించాలి” అనే అంశం మీద ప్రసంగించారు. కార్యక్రమానంతరం విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు, కార్యక్రమ సహాయకులకు, ముఖ్య సమన్వయకర్త శ్రీ డోకి శ్రీనివాస్ తమ ధన్యవాదములు తెలియ చేసారు

patasala 6th anniversary in Charlotte, North Carolina