లండన్ లో ఎన్నారై ట్.ఆర్.యస్ – యుకె నూతన కార్యవర్గ సమావేశం

1007

ఎన్నారై ట్.ఆర్.యస్ – యుకె  నూతన కార్యవర్గ సమావేశం లండన్ లో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అధ్యక్షతన జరిగింది .

 

ఈ కార్యక్రమంలో ముందుగా అమరవీరులకు ,ఆచార్య జయశంకర్ సర్ కి నివాళులు అర్పించి ,నూతన  కార్యవర్గ సభ్యులని సభ కి పరిచయం చేయడం జరిగింది .

ఈ కార్యక్రమంలో   భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎన్నారైల కృషి తదితర విషయాల గురించి చర్చించారు.

 

ఈ సందర్బంగా అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ముందుగా …. ఖండాతరాల్లో ఉన్నపటికీ నాటి ఉద్యమం నుండి నేటి వరకు పార్టీ జెండా మోసే అవకాశం కల్పించిన కెసిఆర్ గారికి,ఎప్పటికప్పుడు తెరాస ఎన్నారై కార్యకర్తల్ని ప్రోత్సహిస్తున్న ఎంపీ కవిత గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

 

ఎన్నో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా పటిష్ట నాయకత్వంతోనే సాధ్యమవుతుందని ,తెలంగాణ పునర్నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర సమితికట్టుబడి వుందని, కెసిఆర్ గారి తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. అట్టడుగువర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

 

నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, మనమంతా చాలా అదృష్టవంతులమని, మైళ్ళ దూరం లో ఉన్నా, కెసిఆర్ గారి నాయకత్వం లో పని చేసే అవకాశం లంబించిందని, అందరంబాధ్యతతో, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

nri-trs-cell-uk-new-committee-meeting-held-at-london nri-trs-cell-uk-new-committee-meeting-held-at-london

అన్ని సందర్భాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెరాస శాఖల సమన్వయం ఎంతో స్ఫూర్తినిస్తుందని, సహకరిస్తున్న అన్ని శాఖల కార్యవర్గ సభ్యులకు,  ముఖ్యoగ అమెరికా తెరాస నాయకులు మహేష్తన్నీరు గారికి కృతఙతలు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో పార్టీ కార్యక్రమాలకి సహకరించి మద్దత్తిచిన తెలంగాణ సంఘాలకి, వ్యక్తులకి, అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు.

 

కార్యవర్గ సభ్యులంతా సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు – తీర్మానాలు చేయడం జరిగింది, వాటి వివరాలు :

 

  1.  తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి  శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు వేడుకలను లండన్ లోఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.

 

  1. ప్రభుత్వ పథకాలను వినూత్నమైన పద్ధతిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కృషి చెయ్యాలని నిర్ణయించడం జరిగింది .

 

  1.  నూతనంగా పదవులు చేపట్టిన సభ్యుల బాధ్యతలను వారికి వివరించడం జరిగింది, ప్రతి మూడు నెలలకు ఒక్కసారి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని సంస్థ చేసిన కార్యక్రమాల  పై ఒకబులెటిన్ కూడా విడుదల చేయాలని నిర్ణయించారు.

 

  1. తెరాస   ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు, వారికి మద్దత్తు తెలుపుతున్న వ్యక్తులకు – సంస్థలకు సరైన రీతిలో ప్రతివిమర్శన చేసి, నిజా నిజాలు ప్రజలకు తెలిసేలా, ఇటు ప్రత్యక్ష మీడియాద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా తెలుపాలని నిర్ణయించారు.

 

చివరిగా ప్రధాన కార్యదర్శి రత్నాకర్ మాట్లాడుతూ, కార్యవర్గ సమావేశం ప్రతి సభ్యునిలో నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని, హాజరైన విలువైన సూచనలను సలహాలను అందించినందుకు,  ప్రతి ఒక్కరికికృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశం విజయవంతానికి ప్రత్యేకంగా కృషి చేసిన ఈవెంట్ కమిటీ సభ్యులు  సత్యపాల్ పింగిళి, నవీన్ భువనగిరి ,రవి ప్రదీప్,సత్య చిలుముల కు ప్రత్యేక కృతజ్ఞతలుతెలిపారు.

 

ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పెద్దిరాజు వందన సమర్పణతో సమావేశం ముగిసింది.

 

 

ఈ కార్యక్రమంలో అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి,అశోక్ దూసరి ,శ్రీకాంత్ పెద్దిరాజు ,సంయుక్త కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి,సత్యం రెడ్డి కంది, సెక్రటరీ సృజన్ రెడ్డి ,సంయుక్త కార్యదర్శి సేరు సంజయ్ ,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,IT సెక్రటరీ వినయ్ ఆకుల , లండన్ ఇంచార్జ్సతీష్ రెడ్డి బండ ,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి ,నవీన్ మాదిరెడ్డి , ఈవెంట్స్ ఇంచార్జ్ సత్యపాల్ పింగిళి ,ఈవెంట్స్  కో ఆర్డినేటర్స్ నవీన్ భువనగిరి ,రవి ప్రదీప్,సత్య చిలుముల  ,వెస్ట్లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం,సురేష్ బుడగం , మరియు ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని,అశోక్ కుమార్ అంతగిరి ,చిత్తరంజన్ రెడ్డి  హాజరైన వారిలో వున్నారు .