లండన్ లో ఘనంగా ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ 5 వ వార్షికోత్సవం – ముఖ్య అతిది గా భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

1328

లండన్ లో ఘనంగా ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ 5 వ వార్షికోత్సవం
– బంగారు తెలంగాణా నిర్మాణం లో కే. సీ. ఆర్ పాలన భేష్, ఎన్నారైల హర్షం !
– ముఖ్య అతిది గా భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

లండన్ లో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ఆద్వర్యం లో “మీట్ అండ్ గ్రీట్ విత్ భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు” మరియు ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ 5 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు, యు.కే నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు హాజరయ్యారు. కార్యదర్శి నవీన్ రెడ్డి గారి అద్యక్షత జరిగిన కార్యక్రమంలో ముందుగా ..అమరులకు స్మరించుకొని, జయశంకర్ గారికి నివాళ్ళు అర్పించి , కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ఐదు సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియో ని ప్రదర్శించి, అతిథులకు వివరించారు.

 

డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి ఉద్యమ – రాజకీయ ప్రస్థానం తో కూడిన ఒక వీడియో ని కూడా ప్రదర్శించారు.

డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతూ, ఉద్యమం లో ఎన్నారై ల పాత్ర గొప్పదని తెలిపారు, ఉద్యమ సంధర్భం లో ఎన్నారై ల పోరాటమిచ్చిన స్పూర్తి ఎప్పటికీ మారవలెనని, ముక్యంగా లండన్ లోని ఎన్నారై. టి.అర్.యస్ విభాఘం పిలుపిచ్చిన ప్రతి కార్యక్రమాన్నికి ఇక్కడ నుండి మద్దతు తెలిపిన తీరు చాలా గొప్పదని ప్రసంశీంచారు. బంగారు తెలంగాణా నిర్మాణ దిశ లో టి.అర్.యస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని – పథకాల గురించి వివరించారు, టి.అర్.యస్ ప్రబుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెతుందని కాబట్టి మీరు కూడా ఎటువంటి సలహాలు అయిన లేదా సందేహాలు ఉన్న వ్యక్తిగతంగా నన్ను కాని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అని తెలిపారు. మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ గారు ఆహార్ నిశలు కష్టపడ్తున్నారని ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. ప్రతి తెలంగాణా బిడ్డ ప్రపంచం లో ఎక్కడున్నా వారి వృత్తుల్లో ఎదిగి రాష్ట్ర పునర్నిర్మాణం లో బాగస్వాములవ్వాలని పిలుపున్నిచ్చారు. తన వంతు బాద్యతగా ముఖ్య మంత్రి కెసిఆర్ గారికి చెప్పి, ప్రబుత్వం లో ప్రత్యేక ఎన్నారై శాఖ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

NRI TRS CELL 5th Anniversary, Chief Guest as Boora Narsaiah Goud Garu - M.P (1) NRI TRS CELL 5th Anniversary, Chief Guest as Boora Narsaiah Goud Garu - M.P (2) NRI TRS CELL 5th Anniversary, Chief Guest as Boora Narsaiah Goud Garu - M.P (3) NRI TRS CELL 5th Anniversary, Chief Guest as Boora Narsaiah Goud Garu - M.P (4) NRI TRS CELL 5th Anniversary, Chief Guest as Boora Narsaiah Goud Garu - M.P (5) NRI TRS CELL 5th Anniversary, Chief Guest as Boora Narsaiah Goud Garu - M.P (6) NRI TRS CELL 5th Anniversary, Chief Guest as Boora Narsaiah Goud Garu - M.P (7) NRI TRS CELL 5th Anniversary, Chief Guest as Boora Narsaiah Goud Garu - M.P (8)

ఎన్నారై. టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ , ఎంతో బిజీగా ఉన్నపటికీ సమయం ఇచ్చి కార్యక్రామానికి వచ్చినందుకు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు, ఎన్నారై టి.అర్.యస్ సెల్ కి ఎప్పటికప్పుడు కెసిఆర్ గారు మరియు యావత్ టి.అర్.యస్ నాయకులు, ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు.
డాక్టర్ వృత్తి లో ఉంటూ…డాట్స్ ఛైర్మన్ గా ఆనాటి ఉద్యమ సమయం లో ..నేడు ఎంపీ గా పునర్నిర్మాణం లో వారి పాత్ర గురించి సభకు వివరించారు. తెలంగాణా పునర్న్నిర్మాణం కేవలం కెసిఆర్ గారి వల్లే సాధ్యమని, వారి నాయక్తవాన్ని బలపరచడం చారిత్రాత్మక అవసరమని సభకు తెలిపారు. ఎలాగైతే ఉద్యమం లో వారి వెంట ఉండి ముందుకు నడిచామో, అలాగే బావిష్యత్తులో కూడా వారు చూపిన బాట లో నడుస్తామని తెలిపారు. కెసిఆర్ గారి ఆదేశాల మేరకు ప్రపంచం లో తెలంగాణా బిడ్డ ఎక్కడున్నా అక్కడ ఎన్నారై. టి.అర్.యస్ శాఖలు ఏర్పాటు చేసి గులాబిమయమ్ చేయడమే లక్ష్యం అని తెలిపారు. పునర్నిర్మాణం లో కూడా కెసిఆర్ గారి వెంట ఉంటామని తెలిపారు. అలాగే రానున్న వరంగల్ ఉప ఎన్నికల్లో టి. ఆర్. యస్ అబ్యార్థి దయాకర్ పసునూరి గారిని బారి మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

 

ఉపాద్యక్షులు మంద సునీల్ రెడ్డి మాట్లాడుతూ…రాజకీయ పార్టీ అయినప్పటికీ, ఎన్నారై లు గా…మా వంతు బాద్యతగా తెలంగాణా ప్రజలకు చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి సభకు వివరించారు. తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) అద్యక్షులు సిక్క చంద్రశేకర్ గౌడ్మాట్లాడుతూ….ఉద్యమ సమయం లో అందరినీ కలుపుకొని పోయిందో , అదే స్పూర్తి తో ఎన్నారై. టి.అర్.యస్ మరియు వివిధ ప్రవాస తెలంగాణా సంస్థల తో పని చేసిన తీరుని వివరించారు. తెలంగాణా పునర్నిర్మాణం లో బాగంగా, మా వంతు బాద్యతగా బిజీనెస్ మీటు మరియు తెలంగాణా సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ – బోనాల సంబరాల గురించి, తెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న చారిటీ కార్యక్రమాల గురించి సభకు వివరించారు.

ఎన్నారై. టి.అర్.యస్ ప్రతినిధులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారిని ఘనంగా సన్మానించి, జ్ఞాపిక ను అందచేశారు., అలాగే ఇదే వేదిక పై తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) ప్రతినిధులు సైతం డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారిని ఘనంగా సన్మానించి, జ్ఞాపిక ను అందచేశారు. చివరిగా ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ 5 వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు కేక్ కట్ చేసి నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.

డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు వచ్చిన అతిథులని వ్యక్తిగతంగా వెళ్లి కలిసి సందడి చేసారు, ఒక డాక్టర్ గా, మేధావిగా వారి సేవలు చాలా గొప్పవని హాజరనైనా ఆదిథులు ప్రశంసించారు. వందన సమర్పణ తో కార్యక్రమాన్ని ముగించారు.

కార్యక్రమంలో ఎన్నారై. టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాద్యక్షులు మంద సునీల్ రెడ్డి, తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) అద్యక్షులు సిక్క చంద్రశేకర్ గౌడ్, కార్యదర్శి నవీన్ రెడ్డి, సెక్రెటరీ దొంతుల వెంకట్ రెడ్డి , యూకే & యురోప్ ఇన్‌ఛార్జ్ విక్రమ్ రెడ్డి,లండన్ ఇన్‌ఛార్జ్ రత్నాకర్ కడుడుల, అధికార ప్రతినిథి శ్రీకాంత్ జెల్ల. వెల్‌ఫేర్ ఇన్‌ఛార్జ్ వినయ్ కుమార్,మెంబర్‌షిప్ ఇన్‌ఛార్జ్ సతీష్ రెడ్డి బండ, వెస్ట్ లండన్ ఇన్‌ఛార్జ్ లు మధుసుదన్ రెడ్డి మరియు రాజేష్ వర్మ ,ముఖ్య నాయకులు శ్రీకాంత్ పెద్ది రాజు, చిత్తరంజన్ రెడ్డి, సృజాన్ రెడ్డి చాడా, సత్య అలాగే తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ప్రతినితులు ఉదయ్ నాగరాజు, ప్రమోద్ అంతటి, నగేష్ రెడ్డి, సుమా దేవి, స్వాతి బుడగం, సురేష్, అపర్ణ,స్వామి ఆశ , జీయర్ ఏడుకేశనల్ ట్రస్ట్ (JET) )ప్రతినిధులు నర్సింహ రెడ్డి, వంశీ , తెలంగాణా జాగృతి ప్రతినిధులు సంపత్,సంతోష్,శ్రవణ్ రెడ్డి , బ్రిటిష్ సౌత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కామర్స్(BSICC) ప్రతినిధులు సుజిత్ నాయర్, జేకబ్ రవిబాలన్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.