ఎన్నారై టి.ఆర్.యస్ క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఎంపీ కవిత

1178

ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ – యూకే అధికారిక 2017 క్యాలెండర్ ని నేడు టి.ఆర్.యస్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా  సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రతినిధులు ఎంపీ కవిత గారికి వివరించారు. పార్టీ నాయకత్వం అన్ని సందర్భాల్లో మీ వెంట ఉంటుందని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా నడుచుకొని కెసిఆర్ గారి నాయకత్వాన్ని మరింత బలపరచాలని ఎంపీ కవిత  సూచించారు. క్యాలెండర్ ఆవిష్కరంచడమే కాకుండా అన్ని సందర్భాల్లో  వెంట ఉండి ప్రోత్సహిస్తున్న కవిత గారికి  ఎన్నారై టి.ఆర్.యస్ నాయకులు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎన్నారై టి. ఆర్. యస్ నాయకులు రాకేష్ రెడ్డి కీసర, రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ పప్పుల, సుభాష్ కుమార్ మరియు టాక్ ప్రతినిధి సాయి నర్రా పాల్గొన్న వారిలో ఉన్నారు.

 

nri-trs-calendar-by-mp-kavitha