నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ June 2016

1131

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో 8వ ఎడిషన్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. డల్లాస్‌లోని 5702 ఆల్ఫా రోడ్ స్పోర్ట్స్‌ప్లెక్స్ జరిగిన ఈ పోటీలు విజయవంతంగా ముగిశాయి.

డల్లాస్ నాట్స్ టీమ్ సహాయ సహకారాలతో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈవెంట్ మొత్తం సజావుగా సాగేలా కోఆర్డినేట్ చేశారు. ఈ టోర్నమెంట్‌కు స్వయంగా వచ్చిన నాట్స్ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ…. నాట్స్ డల్లాస్ చాప్టర్ టీమ్ హార్డ్‌వర్క్‌ ను ప్రశంసించారు.

ఈ వాలీబాల్ టోర్నమెంట్‌లో 24 టీమ్స్ 200 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. అంతేకాదు, నాట్స్ నేషనల్ కప్, వాలంటీర్ కప్ పేరుతో రెండు పోటీలు నిర్వహించింది. నాట్స్ కార్యకలాపాల్లో మొదటి నుంచి చురుగ్గా పాల్గొంటున్న వారి కోసం నాట్స్ వాలంటీర్ కప్ నిర్వహించారు. అట్లాంటాకు చెందిన అట్లాంటిక్ యునైటెడ్ నాట్స్ నేషనల్ కప్ గెలుచుకుంది. స్నైపర్స్ టీమ్ రన్నర్స్ అప్‌గా నిలిచింది. ఇక నాట్స్ వాలంటీర్ కప్‌ను థండర్స్ టీమ్ గెలుచుకోగా… స్పైడర్స్ టీమ్ రన్నర్స్ అప్‌గా నిలిచింది.

ఇక టోర్నమెంట్‌ను చూడడానికి ప్రత్యేకంగా న్యూజెర్సీ నుంచి వచ్చిన నాట్స్ అధ్యక్షులు మోహన కృష్ణకు నాట్స్ డల్లాస్ టీమ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ టోర్నమెంట్‌ను ఎంజాయ్ చేసిన ప్రతిఒక్కరు యాన్యువల్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు నాట్స్‌ను కూడా అభినందించారు.

క్రీడాకారులను ను అభింనందించేందుకు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల, కిషోర్ కంచర్ల, బిందు కొల్లి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు బాపు నూతి, శ్రీనివాస్ కోనేరు, శేఖర్ అన్నె, అజయ్ గొవాడ, చందు కాజ, నేషనల్ టీమ్ సభ్యులు చైతన్య కంచర్ల, సురేంద్ర ధూళిపాళ్ల, వెంకట్ కొల్లి, ఆది గెల్లి, కిషోర్ వీరగంధం, డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్ రామకృష్ణ మర్నేని టోర్నమెంట్‌కు విచ్చేశారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించినందుకు నాట్స్ డల్లాస్ చాప్టర్‌ను అభినందించారు. పోటీలో గెలుపొందిన విజేతలు, రన్నర్స్ అప్ టీమ్‌లను నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ అధ్యక్షులు మోహన్ కృష్ణ మన్నవ, టాన్‌టెక్స్ అధ్యక్షులు సుబ్బు జొన్నలగడ్డ, నాట్స్ వాలంటీర్లు విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ ఈవెంట్‌కు కవరేజ్ ఇచ్చిన టీవీ9, టీవీ5కి, స్పాన్సర్స్‌గా వ్యవహరించిన బావర్చి బిర్యాని పాయింట్, సౌత్‌ఫోర్క్ డెంటల్, రామ్ కొనారా రియాల్టీ, యునైటెడ్ ఐటీ సొల్యూషన్స్, యాక్సెల్ ఇంటర్నేషనల్, స్పార్కల్స్‌కి నాట్స్ డల్లాస్ టీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఈ టోర్నమెంట్‌కు విచ్చేసిన ప్రతి ఒక్కరు కమ్యూనిటీ కోసం నాట్స్ చేస్తున్న కార్యక్రమాలను, కమిట్‌మెంట్‌ను మెచ్చుకున్నారు. ఈవెంట్‌ బాధ్యతను తీసుకున్న నాట్స్ స్పోర్ట్స్ కమిటీ సభ్యులకు, క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలిపారు.

NATS Tournament - 2 NATS Tournament-  3 NATS Volleyball Tournament - 1 volleyball1 volleyball2 volleyball3 volleyball4