సెయింట్ లూయిస్ లో నాట్స్ లేడిస్ నైట్ కార్యక్రమానికి విశేష స్పందన

1203

సెయింట్ లూయిస్  అనేక కార్యక్రమాలతో తెలుగు ప్రజల మనస్సు చూరగొంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ లేడీస్ నైట్ కార్యక్రమం నిర్వహించింది. నాట్స్ స్థానిక తెలుగు మహిళలను సమీకరించి సెయింట్ లూయిస్ లో తొలిసారిగా  జరిపిన లేడీస్  నైట్ కు విశేష స్పందన లభించింది.
నాట్స్ మహిళా కార్యవర్గం ఎంతో చక్కగా లేడీస్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దాదాపు 250 మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమాంలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా నాట్స్ మహిళా విభాగం నుంచి  విజయ, శిరిష యలమంచిలి, ఇందిరా గరిమెళ్ల, నీలిమ ముమ్మగండి తదితరుల నాయకత్వంలో చాలా మంది మహిళలను లేడీస్ నైట్ కు సమీకరించారు.  ఇండియా నుంచి వచ్చిన  సింగర్, యాంకర్ మధు పాటలతో అలరించారు. స్థానికంగా ఉండే కళకారులు కూడా లేడిస్ నైట్ లో తమ ప్రతిభ చూపారు. మహిళల మధ్య  నాట్స్  పెట్టి సరదా ఆటల పోటీలకు చక్కటి స్పందన లభించింది. తెలుగు ఆట పాటలకు వచ్చిన మహిళలంతా  ఎంతో ఎంజాయ్ చేశారు. నాట్స్ మహిళా సాంస్కృతిక విభాగం ఈ ఆటల, పాటల పోటీల్లో ప్రతిభ చూపిన వారికి చిన్న చిన్న బహుమతులు అందించి ఇక్కడకు విచ్చేసిన మహిళల్లో జోష్ నింపారు. సిగ్నేచర్ ఇండియా, అవర్ అర్జంట్ కేర్ ఈ కార్యక్రమానికి తమ పూర్తి సహకారాన్ని అందించారు. శ్రేయస్ డీజే ఇక్కడ సంగీతం హోరెత్తించేలా సంగీత ఏర్పాట్లు చేసింది. దీనికి సాంకేతిక నిపుణులు నవీన్ సహాకారం అందించారు.  ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో  పేద బడుగు, బలహీనవర్గాలకు సాయం అందించే గ్లో ఫౌండేషన్ కు ఈ కార్యక్రమం ద్వారా వచ్చే నిధులు ఇవ్వాలని నాట్స్ సంకల్పించింది. గ్లో పౌండేషన్ ఆంధ్రప్రదేశ్ లో పేద పిల్లల జీవితాల్లో అక్షర కాంతులు నింపేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు అందించడంతో పాటు యూనిఫామ్ లు కూడా  గ్లో పౌండేషన్ అందిస్తోంది. భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే నాట్స్  దానికి తగ్గట్టుగానే  అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే లేడిస్ నైట్ కార్యక్రమంలో మిగిలిన నిధులను గ్లో పౌండేషన్ కు అందించనుంది.
12 రకాల వంటలతో సిగ్నేచర్ ఇండియా వారు విందు భోజనం సమకూర్చారు. నాట్స్ 2017 చికాగో సంబరాలకు అందరూ పాల్గొనాలని సెయింట్ లూయిస్ చాప్టర్ నుండి స్థానిక నాయకత్వం పిలుపు నిచ్చింది.

sl_luis-ladies-night