నాట్స్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రవి అచంట నూతన నాయకుడిని ప్రకటించిన నాట్స్ బోర్డ్

1421
నాట్స్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రవి అచంట 
నూతన నాయకుడిని ప్రకటించిన నాట్స్ బోర్డ్

అక్టోబర్ 10: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచిన  ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అక్టోబర్ 8 న జరిపిన అత్యవసర సమావేశంలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రవి అచంటను ప్రకటించింది. ఎప్పటికప్పుడు యువ నాయకత్వాన్ని ప్రోత్సాహించే నాట్స్  రవి అచంటకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. చికాగో నాట్స్ ఛాప్టర్ అభివృద్ధితో పాటు.. అక్కడ తెలుగువారికి సేవలందించడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి అచంట అనతి కాలంలోనే నాట్స్ లో కీలక సభ్యుడిగా ఎదిగారు. చికాగోలో నాట్స్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు.. నాట్స్ జాతీయ కార్యవర్గంలోనూ విలువైన సేవలు అందించారు. పశ్చిమగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, గాంధీనగరానికి చెందిన రవి అచంట బ్రిస్బైన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్  డిగ్రీ చేశారు. ఇండోర్  యూనివర్సీటీ నుంచి ఎం.ఎస్ కూడా పూర్తి చేశారు.. అమెరికాకు వెళ్లిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ప్రస్తుతం వెరిట్రా ఐటీ కంపెనీకి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు.NATS Ravi Achanta

ప్రస్తుతం నాట్స్ అధ్యక్షుడిగా ఉన్న గంగాధర్ దేసు తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ రవి అచంటను నాట్స్ అధ్యక్షుడిగా ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో కిడ్ని బాధితులకు ఆర్వో ప్లాంట్ల ఏర్పాట్లు,  ప్రభుత్వ బడుల్లో నాట్స్ స్కూల్ బ్యాగ్ ల పంపిణీతో పాటు అనేక సేవా కార్యక్రమాల నిర్వహణలో గంగాధర్ దేసు నిర్వహించిన పాత్రను నాట్స్ ప్రశంసించింది. ఇక ముందు ఇదే ఒరవడిన కొనసాగించేందుకు రవి అచంటకు నాట్స్ కార్యనిర్వహక అద్యక్ష బాధ్యతలు అప్పగించింది.