నాట్స్ ఆధ్వర్వంలో ఉచిత దంత వైద్య శిబిరం *** డాలస్ లో తెలుగు వారికి ఉచిత దంత పరీక్షలు

1167

ఇర్వింగ్: టెక్సాస్: భాషే గమ్యం, సేవే గమ్యం నినాదంతో ప్రపంచంలోని తెలుగు వారందరి హృదయాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది నాట్స్. ముఖ్యంగా అమెరికాలోని తెలుగువారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షించే బాధ్యత తీసుకుంది. తాజాగా నాట్స్ డల్లాస్ చాప్టర్ ఉచిత దంత పరీక్షలు నిర్వహించింది. డల్లాస్/ఫోర్ట్ వర్త్ ఏరియాలో నివసించే తెలుగువారి కోసం అక్టోబర్ 18న సౌత్ ఫోర్క్ డెంటల్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్ నిర్వహించారు. డెంటిస్ట్ గా పేరు ప్రఖ్యాతలున్న డాక్టర్ బిందు కొల్లి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు వందమందికి పైగా తెలుగువాళ్లు ఈ సేవలను ఉపయోగించుకుని, డాక్టర్ బిందు కొల్లి నుంచి విలువైన ఆరోగ్య సలహాలు అందుకున్నారు. నాట్స్ ద్వారా తెలుగు ప్రజలకు విలువైన సేవలు అందించినందుకుగాను డాక్టర్ బిందు కొల్లికి నాట్స్ డల్లాస్ చాప్టర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. డెంటల్ క్యాంప్ ను విజయవంతం చేసినందుకు టీమ్ మెంబర్స్, వాలంటీర్లు, స్పాన్సర్స్, చెకప్ కు వచ్చిన వారికి నాట్స్ డాలస్ చాఫ్టర్ కృతజ్ఞతలు తెలిపింది.

Dallas_NATS_DentalCamp