జన్మభూమి రుణం తీర్చుకునే క్రమంలో నాట్స్ మరో ముందడుగు

858

ఏప్రిల్ 2: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్… జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఏదో ఒక కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో చేపడుతూనే ఉంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా కాకుమాను మండలం కోతివాని పాలెం లో నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. దాదాపు 2000 మంది ఈ ఉచిత వైద్యశిబిరానికి విచ్చేసి డాక్టర్ల విలువైన సూచనలు.. మందులు పొందారు. నాట్స్ ప్రతినిధి శ్రీనివాస్ మంచికలపూడి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరానికి కామేపల్లి వెంకటేశ్వర్లు, బాలకృష్ణ మంచికలపూడి, సుధాకర్ గరికపాటి, తదితర కోతివాని పాలెం గ్రామ ప్రముఖులు మద్దతు అందించారు. గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ జానీమూన్ తో పాటు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కూడా ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు తమవంతు సహాయ సహకారాలు అందించారు. గుంటూరు రమేష్ హాస్పటల్స్, శంకర్ ఐ పౌండేషన్ సహకారాలతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సేవాభావంతో ఈ శిబిరానికి వచ్చిన డాక్టర్లు ఉచిత వైద్యసేవలు అందించారు. మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది.
ఇదే స్ఫూర్తి తో మరి కొంత మంది తోటి నాట్స్ ప్రతినిధులతో, జన్మభూమి పై మమకారం ఉన్న మరికొంత మంది తో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించటానికి నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ పథక రచన లో నిమగ్నమయ్యారు.

NATS free medical camp item held in Guntur district, Kotivaanipalem (1) NATS free medical camp item held in Guntur district, Kotivaanipalem (2) NATS free medical camp item held in Guntur district, Kotivaanipalem (3) NATS free medical camp item held in Guntur district, Kotivaanipalem (4) NATS free medical camp item held in Guntur district, Kotivaanipalem (5)