వి.బి. రాజేంద్రప్రసాద్ మృతి పట్ల నాట్స్ సంతాపం

1216

V B Rajendra Prasadతెలుగు సినీ పరిశ్రమకు చెందిన వరుస విషాద వార్తలపై అమెరికాలో తెలుగుజాతి యావత్తు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలిపింది. ప్రముఖ నిర్మాత జగపతి పిక్చర్స్ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్ మృతి పై నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఎన్నో చక్కటి కుటుంబ కథా చిత్రాలను నిర్మించిన వి.బి. రాజేంద్ర ప్రసాద్ ను నాట్స్ కూడా డాలస్ సంబరాల సమయంలో పురస్కారంతో సన్మానించుకున్న  విషయాన్ని గుర్తు చేసుకుంది. వి.బి రాజేంద్ర ప్రసాద్ మరణం యావత్ తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటని నాట్స్ పేర్కొంది.  వి.బి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది.