కొలంబస్ లో ప్రారంభమైన నాట్స్ ప్రస్థానం – సెంట్రల్ ఓహియో కొలంబస్ చాప్టర్ ప్రారంభించిన మోహన కృష్ణ మన్నవ

1048

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే  నాట్స్ తన పరిధిని క్రమంగా పెంచుకుంటూపోతోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా సెంట్రల్ ఒహియోలో నాట్స్ కొలంబస్ చాప్టర్ ను ప్రారంభించింది. నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ జనవరి 30న కొలంబస్ సిటీలో ఈ చాప్టర్ ను ప్రారంభించారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమొచ్చినా నాట్స్ హెల్ఫ్ లైన్ కు కాల్ వస్తుందని.. దీనిని బట్టే అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తుందనేది స్పష్టమవుతుందని మోహన కృష్ణ మన్నవ అన్నారు. నాట్స్ గత ఎనిదేళ్లుగా చేపట్టిన కార్యక్రమాలు, సామాజికంగా తెలుగు వారికి నాట్స్ టీమ్ ఏ విధమైన సాయం అందిస్తోందన్న వివరాలను నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ వివరించారు. నాట్స్ నేషనల్ టీమ్ సభ్యుడు సురేష్ పూదోట ప్రారంభించిన ఈ ప్రారంభసదస్సులో వచ్చిన అతిథులందరికీ నాట్స్ జాయింట్ సెక్రటరీ శ్రీధర్ కేసాని ని సురేష్ పూదోట పరిచయం చేశారు. నాట్స్ తెలుగువారి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందనేది వివరించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కొడాలి శ్రీనివాస్, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బసవేంద్ర సూరపనేని, శ్రీనివాస్ కొడాలి, శ్రీనివాస్ కొత్తపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొడాలి వివరించారు. నాట్స్ హెల్ప్ లైన్((1-888-4-Telugu) – 1-888-483-5848 ద్వారా తెలుగు కుటుంబాలకు ఏ విధంగా సహాయ సహకారాలను అందించిందీ ,  బసవేంద్ర సూరపనేని సవివరంగా తెలియచేసారు.

కొలంబస్ చాప్టర్ సభ్యులుగా ఎంపికైన ఫణి భూషణ్ పొట్లూరి, జగన్ చలసాని, నవ్య కుప్ప, కోటేశ్వరరావు బోడెపూడి పేర్లను నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ ప్రకటించారు. ఈ సందర్భంగా టీమ్ సభ్యులకు, కమ్యూనిటీకి నాట్స్ తరపున అభినందనలు తెలిపారు.
కొలంబస్ చాప్టర్ ప్రారంభోత్సవానికి దాదాపు 150 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరై.. ఈవెంట్ ను విజయవంతం చేసిన వారందరికీ శ్రీధర్ కేసాని కృతజ్ఞతలు తెలిపారు.

NATS Columbus Central Ohio Chapter Kick off meeting 1 NATS Columbus Central Ohio Chapter Kick off meeting 2 NATS Columbus Central Ohio Chapter Kick off meeting