మిచిగాన్ – డిట్రాయిట్ లో నాట్స్ బిజినెస్ సెమీనార్ *** విజయ రహస్యాలను వివరించిన వ్యాపార దిగ్గజాలు***

1469
22-Feb-2014 మిచిగాన్ డిట్రాయిట్ లో నాట్స్ బిజినెస్ సెమీనార్ – విజయరహాస్యాలను వివరించిన వ్యాపార దిగ్గజాలు కష్టపడి పనిచేయడమే కాదు..మనం దానిని ఎలా చేశామనేది కూడా చాలా ముఖ్యమని అమెరికాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త బాలే టెక్నాలజీస్  సీ.ఈ.ఓ రమేష్ శ్రీనివాసన్ అన్నారు.. నమ్మకం అనేదు ఒక్కొక్క బిందువు తో ఏర్పడుతుంది కాని పోయేటప్పుడు బక్కెట్లతో పోతుందని.. కాబట్టి నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో అసలు విజయ రహాస్యం ఉందని రమేష్ శ్రీనివాస్ తెలిపారు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి, 2బిలియన్ డాలర్ల కంపెనీ అదినేతగా ఎదగడం వరకు సాగిన తన జీవనయానంలో  కీలక మలుపులను వివరించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో మిచిగాన్ రాష్ట్రంలోని నొవై సివిక్ సెంటర్ లో బిజినెస్ సెమీనార్ జరిగింది. ఇందులో ముఖ్య అతిధిగా విచ్చేసిన రమేష్ శ్రీనివాసన్ ఎన్నో వ్యాపార మెళకువలను వివరించారు.. మన విజయ సాధనకు  ఓపిక, స్థితప్రజ్ఙత ఈ రెండూ కూడా చాలా ముఖ్యమైనవి రమేష్ తెలిపారు.. మీ సంస్థలో పనిచేసే సాటి ఉద్యోగిని ‘నాకోసం పనిచేస్తాడు’ అనే కంటే నాతో పనిచేస్తాడు అనడం ఎంతో మేలు చేస్తుందని అబకస్ అధినేత ఆకునూరి శ్రీరాం తెలిపారు. అబకస్ అమెరికా ఇండియా, కెనడా లాంటి దేశాల్లో ఎలా విస్తరిస్తుందనేది శ్రీరాం చెప్పుకొచ్చారు. నాట్స్ సామాజిక బాధ్యతతో వేస్తున్న అడుగులు.. చేపడుతున్న సేవా కార్యక్రమాలను నాట్స్ అధ్యక్షుడు గంగాధర్ దేసు వివరించారు.  శ్రీనివాస్ కొడాలి, అరుణ బావినేని , ద్వారకా ప్రసాద్ బొప్పన , వేణు సూరపరాజు , కృష్ణ మోహన్ నిచ్చనమెట్ల ఈ సెమీనార్ కు ముఖ్య అతిధులుగా విచ్చేశారు.CEO with Members CEOs President Secretary Director Chapter lead
నాట్స్ కార్యదర్శి  బసవేంద్ర సూరపనేని చొరవతో జరిగిన ఈ బిజినెస్ సెమీనార్ ఆద్యంతం ఎంతో ఉపయుక్తంగా జరిగింది..ఈ సెమీనార్ కు సహకరించిన డెట్రాయిట్ తెలుగు అసోషియేన్ డీటీఏ సభ్యులు  నాని గోనుగుంట్ల, మనోరమ గొంది, శ్రీనివాస్ గోరుముచ్చు, క్రాంతి మన్నె, సుధామోహన్ రెడ్డి, సోంసాగర్, హర్ష అంచె, యుగంధర్ భూమిరెడ్డి బసవేంద్ర సూరపనేని ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సెమీనార్ విజయవంతానికి  కరుణాకర్ పోరెడ్డి, షోనక్, జగదీష్ చాపరాల, కిషోర్ తమ్మినీడి, శ్రీధర్ భండారు, దివాకర్ దొడ్డపనేని, శ్రీనివాస్ బోయపాటి, శ్రీని కొడాలి, శివ అడుసుమిల్లి, భాస్కర్ వారణాసి, కిషోర్ కొడాలి, దత్త సిరిగిరి, గౌతం మార్నెని, శ్రిధర్ ఆట్లూరి, శ్రీకృష్ణ క్రొత్తపల్లి తదితరులు తమవంతు పాత్ర పోషించారు.
Dr Kodali Desu garu IMG_2681 IMG_2697 IMG_2703 NATS President Sri Desu Gangadhar NATS Secretary Basavendra SurapaneniPressmeetSri Ramesh Srinivasan CEO Bally Technologies