టి.ఎల్.సి.ఏ , తానా ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలు

1400

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము (టి.ఎల్.సి.ఏ) మరియు “తానా” సంస్థలు సంయుక్తంగా మే 14 వ తేదీ, న్యూయార్క్ నగరంలో  నిర్వహించిన మాతృదినోత్సవ వేడుకలు మనోహరంగా జరిగాయి. ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు మూర్తీభవించిన మహిళలు, తల్లులు హాజరైన ఈ కార్యక్రమం విశేషంగా అందరినీ ఆకట్టుకుంది.

“తానా” మరియు “టి.ఎల్.సి.ఏ” సభ్యులు కలసి ఎంతో కోలాహలంగా నిర్వహించిన ఈ కార్యక్రమo విచ్చేసిన మాతృమూర్తులందరికీ ఎన్నో ఆనందానుభూతులను మిగిల్చింది.

“అమ్మ అందమైన అనుబంధం.. అంతులేని అనురాగం” అంటూ ఆహుతులు తమ మాతృమూర్తితో ఉన్న అనుబంధాన్ని తలచుకొని పులకించారు. అమ్మ ఇతివృత్తంతో రూపొందించిన ఆటలు,పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా కొనసాగి అందరినీ అలరించాయి.  ఆద్యంతం నిర్వహించిన పలు వినోద పోటీల్లో విజేతలు పలు బహుమతులు గెలుచుకున్నారు.

TLCA & TANA  MOTHERS DAY GRAND CELEBRATIOS (1) TLCA & TANA  MOTHERS DAY GRAND CELEBRATIOS (2) TLCA & TANA  MOTHERS DAY GRAND CELEBRATIOS (2) TLCA & TANA  MOTHERS DAY GRAND CELEBRATIOS (4) TLCA & TANA  MOTHERS DAY GRAND CELEBRATIOS (8) TLCA & TANA  MOTHERS DAY GRAND CELEBRATIOS (10) TLCA & TANA  MOTHERS DAY GRAND CELEBRATIOS (12)TLCA & TANA  MOTHERS DAY GRAND CELEBRATIOS (1)

నాలుగు తరాల “తానా” మరియు “టి.ఎల్.సి.ఏ” సభ్యులు కలసి పాల్గొన్నఈ కార్యక్రమం   నిర్వహించడం  ప్రేమ, అనురాగం, ఆప్యాయత మూర్తీభవించిన తల్లులంతా విచ్చేసి “టి.ఎల్.సి.ఏ” మరియు “తానా” సంస్థలను  ఆశీర్వదించడం ఎంతో అభినందనీయమని. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు “టి.ఎల్.సి.ఏ” తో కలసి నిర్వహిస్తామని లక్ష్మి దేవినేని రీజనల్ ఛేయిర్, “తానా”, జయ్ తాళ్లూరి ట్రస్టీ, తానా ఫౌండేషన్ తెలిపారు. విచ్చేసిన మాతృమూర్తులందరికీ  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అధ్యక్షులు సత్య చల్లపల్లి గారు మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమo “తానా”  సంస్థ తో కలసి నిర్వహించడం ఏంతో సంతోషంగా ఉందని ఈ కార్యక్రమానికి  విచ్చేసిన తెలుగు ఆడపడుచులకు, మాతృమూర్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.

భవిష్యత్తులో కూడా మహిళలు తమ ప్రేమ, ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగించి “టి.ఎల్.సి.ఏ”కి అండగా నిలిచి “టి.ఎల్.సి.ఏ” చేస్తున్నకార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ మాతృదినోత్సవ వేడుక వైభవంగా, ఆహుతులు ఆనoదపడేలా నిర్వహించిన “టి.ఎల్.సి.ఏ” సంస్థ కార్యవర్గానికి, సభ్యులకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.