కాలిఫోర్నియా శాక్రమెంటో మనబడి తెలుగు తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమం

1477

తెలుగు అసోసియేషన్ శాక్రమెంటో (టీఏజీఎస్) సౌజన్యంతో కాలిఫోర్నియా శాక్రమెంటో శివారు నగరం ఫాల్సోం గోల్డ్ రిడ్జ్ స్కూల్ లో ఉన్న‌ కాన్ఫరెన్స్‌ హాలు లో శనివారం సెప్టెంబర్ 12, 2015 న సిలికానాంధ్ర మనబడి తెలుగు తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ప్రియ అతిధులు సిలికానాంధ్ర మనబడి ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ, కాలిఫోర్నియా శాక్రమెంటోలో మనబడి ప్రారంభించాలన్న సిలికానాంధ్ర చిరకాల కోరిక టీఏజీఎ సౌజన్యంతో 2 ఏండ్ల క్రితం నెరవేరింది అన్నారు. పిల్లలతో ఎటువంటి సమస్యలేదని, వారు త్వరగా తెలుగు నేర్చుకొంటారు అని, అయితే వారి కృషికి తల్లిదండ్రులు కూడా తోడ్పడాలని వారు విజ్ఞప్తి చేసారు. శాక్రమెంటో లో ఉన్న తెలుగు కుటుంబాలకు చెందినా చిన్నారులకు తెలుగు భాష నేర్పించాలన్న టీఏజీఎస్ ఆశయానికి తమ తోడ్బాటు సదా ఉంటుందని చెప్పారు. వారితో పాటు సిలికానాంధ్ర మనబడి పరిపాలన విభాగ కార్యదర్శి శ్రీవల్లి కొండుభట్ల 2015-2016 సంవత్సరానికి మనబడి తరగతులలో చేరిన విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరొ ప్రియమైన అతిధి స్థానిక కాలిఫోర్నియా యూనివర్సిటీ డేవిస్ కాంపస్ ప్రొఫెసర్ డా శివాజీ రావు వల్లురుపల్లి ఈసందర్భంగా పిల్లలకు తెలుగు నేర్పడానికి టీఏజీఎస్ చేస్తున్న ఈచిన్న ప్రయత్నానికి ప్రోత్సాహం ఇవ్వాలని శాక్రమెంటో తెలుగువారందరికీ విజ్ఞప్తి చేసారు.

స్థానిక కాలిఫోర్నియా యూనివర్సిటీ డేవిస్ కాంపస్ కు చెందిన మరో ప్రొఫెసర్ డా వేమూరి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేశారు. డా వేమూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ మనబడి తో పాటుగా కాలిఫోర్నియా యూనివర్సిటీ బెర్కేలీ కాంపస్ లో కాలేజి స్థాయి లో జరుగుతున్న తెలుగు క్లాసులకు కుడా ప్రోత్సాహం ఇవ్వాలని శాక్రమెంటో తెలుగువారందరికీ విజ్ఞప్తి చేసారు. ఇక్కడ మనబడి లో తెలుగు క్లాసులు హాజరు అయిన తెలుగు పిల్లలకు, భవిష్యత్తు లో బెర్కేలీ కాంపస్ లో తెలుగు క్లాసులు కు ప్రవేశం సులభం గా లభిస్తుంది అని చెప్పారు. బెర్కేలీ కాంపస్ లో తెలుగు క్లాసులకు శాశ్వత నిధి కి అవసరం అయిన 500 వేల డాలర్లకు గాను 400 వేల డాలర్లు వసూలు అయ్యాయని, ఇంకో 100 వేల డాలర్లు సమకూరితే, తెలుగు క్లాసులు శాశ్వతంగా అందుబాటులో ఉంటాయి అని చెప్పారు. డా వేమూరి వారి పిలుపుకు స్పందించి స్థానిక తెలుగు వారు శ్రీమతి ఆది లింగం, శ్రీనివాస లింగం గార్లు అప్పటికప్పుడు 1,116 డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.

టీఏజీఎస్ అధ్యక్షులు వెంకట్ నాగం ఈసందర్భంగా మాట్లాడుతూ కాలిఫోర్నియా శాక్రమెంటోలో నివాసం ఉంటున్న తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలకి తెలుగు నేర్పాలన్న ఆలోచనతో సిలికానాంధ్ర సహకారంతో ‘మనబడి’ ని శాక్రమెంటోలో ప్రారంభించడం జరిగినది అని అన్నారు. ఈసందర్భంగా పిల్లలకు తెలుగు నేర్పడానికి రెండు ఏండ్లుగా టీఏజీఎస్ చేస్తున్న ప్రయత్నానికి ప్రోత్సాహం ఇవ్వాలని శాక్రమెంటో తెలుగువారందరికీ విజ్ఞప్తి చేసారు.

టీఏజీఎస్ అధ్యక్షులు వాసు కుడిపూడి ఈసందర్భంగా మాట్లాడుతూ, 2007 లో బెర్కేలీ కాంపస్ లో తెలుగు క్లాసులకు 5,000 డాలర్ల నిధి టీఏజీఎస్ సమకూర్చినట్లు తెలిపారు. శాక్రమెంటో లో తెలుగు క్లాసులకు పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానిక తెలుగు వారికి అభినందనలు తెలిపారు.

కాలిఫోర్నియా శాక్రమెంటోలో మనబడికి స్వచ్ఛందంగా పనిచేస్తున్న స్థానిక అధ్యాపకులు “ప్రసాద్‌ పన్నాల, విజయలక్ష్మిపన్నాల, మోహన్ పెంటా, సాంబశివరావు, భాస్కర్ వెంపటి”, మనబడి ప్రణాళిక బృందాన్ని మరియు, కార్యకర్తలను టీఏజీఎస్ అధ్యక్షులు వెంకట్ నాగం అందరికీ పరిచయం చేశారు. ఈసందర్భంగా స్థానిక మనబడి పిల్లలు మా తెలుగు తల్లికి మల్లెపూదండ తో పాటు పలు గీతాలు, పద్యాలు, కమ్మనైన కధలతో అందరినీ ఆకట్టుకున్నారు.

స్థానిక రుచి రెస్టారెంట్‌ వారు పసందైన తెలుగు భోజనం సమకూర్చి, వడ్డించి అందరి మన్ననలను చూరగొన్నారు. కాలిఫోర్నియా శాక్రమెంటోలో మనబడి ప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషిచేసిన వారిలో మనబడి సంధానకర్త మరియు టి ఏ జీ ఎస్ ట్రస్టీ మల్లిక్ సజ్జనగాండ్ల, అధ్యాపకులు ప్రసాద్‌ పన్నాల, టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు మనోహర్ మందడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, అబ్దుల్ షైక్, దుర్గా చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, వాసు కుడుపూడి, భాస్కర్ దాచేపల్లి, వెంకట్ నాగం, కీర్తి సురం, TAGS కార్యకర్తలు, అధ్యాపకులు తదితరులు ఉన్నారు. వెంకట్ నాగం వందన సమర్పణ గావించారు. ఫోటోగ్రఫీ కు సహకారం అందించిన చంద్ర గాజుల, మరియు ఫణి డోగిపర్తి లకు టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాబోవు వారాలలో ఫాల్సం పాటు మరిన్ని శాక్రమెంటో శివారునగరాలలో కూడా మనబడి తరగతులు జరుగుతాయి అని, శాక్రమెంటోలో మనబడి తరగతిలో పిల్లలను చేర్పించదలచుకున్నవారు మరింత సమాచారం కోసం టీఏజీస్‌ సమన్వయ కర్త మల్లిక్ సజ్జనగాండ్ల ను ఫోన్ 916 673 8352 లేదా ఈమెయిలు [email protected] లో సంప్రదించగలరు అని టీఏజీఎ కార్యవర్గం ప్రకటించింది. టీఏజీస్‌ సమన్వయ కర్త మల్లిక్ సజ్జనగాండ్ల మరియు అధ్యాపకులు ప్రసాద్ పన్నాల, శాక్రమెంటోలో సిలికానాంధ్ర మనబడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియచేసారు.
Manabadi Inauguration Event at California - Sacramento 1

Manabadi Inauguration Event at California - Sacramento 2

Manabadi Inauguration Event at California - Sacramento 3

Manabadi Inauguration Event at California - Sacramento 4

Manabadi Inauguration Event at California - Sacramento 5

Manabadi Inauguration Event at California - Sacramento 6