దక్షిణ కాలిఫోర్నియాలో మనబడి సాంస్కృతికొత్సవం – ఫిబ్రవరి 21 & 22

1245

ఐదేళ్ళ క్రితం దక్షిణ కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మనబడి ద్వారా మొదలైన తెలుగుభాష ప్రయాణం మహర్దశలో, విన్నూత్న దిశలో సాగుతుంది అనడంలో సందేహం లేదు!! ఈ విద్యాసంవత్సరం దక్షిణ కాలిఫోర్నియాలో 500+ మంది తెలుగుపిల్లలు సగర్వంగా తెలుగు నేర్చుకుంటున్నారు! “ఇది నా ఉనికికి చెందిన భాష” అని మన పిల్లలు సవినయంగా పదిమందికి చాటిచేప్పుతున్నారు! ఈ మనబడి తెలుగు పిల్లలను సత్కరించడానికి ఈసారి దక్షిణ కాలిఫోర్నియాలో మనబడి సాంస్కృతికొత్సవం రెండు ప్రదేశాలలో జరగబోతుంది – మొదటిది  ఫిబ్రవరి 21న లోస్ అంజేలీస్ నగరంలోని జార్డన్ హై స్కూల్లో, రెండవది ఫిబ్రవరి 22న సాన్ డియాగో నగరంలోని మార్స్టన్ మిడిల్ స్కూల్లో. వివరాలకొరకు క్రింద జతపరచిన వివరణ పత్రాలు చూడండి. ఐదేళ్ళ పండగ వచ్చిందోయ్, ఐదొందలు పిల్లల్ని తెచ్చిందోయ్! భాషాసేవయే భావి తరాల సేవ!

Manabadi Cultural Festival LA 2015 Manabadi Cultural Festival SD 2015