లోక్ సత్తా నే తన సత్తా అంటున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు

1510
లోక్ సత్తా నే తన సత్తా అంటున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు
లోక్ సత్తా నే తన సత్తా అంటున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు
మార్చి 3న , తిరుపతి బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు

“ఆయన అర్ధరాత్రి సూర్యుడు” అని త్రివిక్రం శ్రీనివాస్ “మా మ్యుజిక్ అవార్డ్స్” సంధర్బంగా చెప్పటం మీరింకా మర్చిపొయివుండరు. సూర్యాస్తమయం మిగిల్చే చీకట్లను తన కలం కాంతులతో ఛేదించే ఆ మనీషి , రాష్ట్రం అంధకారం వైపు అడుగులేస్తోంది అనుకున్నాడో  ఏమో , తన కలంతో ప్రజల కలతలను కనుమరుగు చేద్దామనుకున్నాడో ఎమో, తిరుపతిలో జరిగే లోక్ సత్తా బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

వెంకన్న సన్నిధిలో , ఈ సరస్వతీ పుత్రుని మాటల్లో “లోక్ సత్తా ఇది మన సత్తా” అనే మాటలు వినాలని ప్రపంచ వ్యాప్తంగా లోక్ సత్తా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆయన మాటలు ప్రేరణతో నిండిన తూటాలు అనటంలో అతిశయోక్తి లేదు. ఈ సభతో ‘బయట పడదామ వద్దా’ అని నిర్ణయించుకొలేని ఎందరో  ప్రముఖులు లోక్ సత్తాకు బహిరంగంగా మద్దతు పలుకుతారని ఆశించటం చాలా న్యాయమైనదనే చెప్పుకోవాలి.

లోక్ సత్తా నే తన సత్తా అంటున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు
లోక్ సత్తా నే తన సత్తా అంటున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు