లాస్ ఏంజల్స్, 20 January 2014: శనివారం, జనవరి 18 న లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా ) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి మేళ విజయ వంతగా నిర్వహించడం జరిగింది. ఈ మేళా కు సుమారు 1500 మంది లాస్ ఏంజల్స్ పరిసర ప్రాంతాల నుంచి లాంగ్ బీచ్ జోర్డాన్ హై స్కూల్ కు వచ్చి ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సంబరాల్లో నిర్వహించిన తిరునాళ్ళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆద్యంతమూ పండుగ వాతావరణం, అడుగడుగునా తెలుగుతనం ఉట్టిపడేలా జరిగిన ఈ మేళా అందరిని ఒక్కసారి వూర్లల్లో జరుపుకునే పండుగ జ్ఞాపకాలను గుర్తుకొచ్చేలా చేసింది. తిరునాళ్ళ లో చిన్న పెద్ద తేడాలు మరిచి అందరు చాలా ఉత్సాహంగా వివిధ ఆట లలో పాల్గొన్నారు. ఈ తిరునాళ్ళలో పిల్లలకు ఫేస్ పైంటింగ్, గోరింటాకు అలంకరణ మరియు వివిధరకాల ఆటలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.

ఈ తిరునాళ్ళను చెరుకు గడలు, అరటి చెట్లు , ముగ్గులు మరియు బంతి పూలతో గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా అలంకరించారు. తిరునాళ్ళలో ఏర్పాటు చేసిన రంగస్థలంలో ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరికి మంచి వినోదాన్ని పంచాయి. సంక్రాంతి మేళాలో ఇరవై మంది కి పైగా తెలుగు బాల బాలికలు తిరునాళ్ళ లో 10 స్టాల్స్ ని స్వచ్చందంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ కోచర్లకోట సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత, లాటా వారి వివిధ కార్యక్రమాల గురించి చక్కగా వివరించారు. సంక్రాంతి మేళాలో లాటా ఉపాధ్యక్షులు రవి తిరువాయిపాటి గారు రాసిన “లాటా సంక్రాంతి పాట” ను ఫ్లాష్ మాబ్ టీం కృష్ణ సామంతుల బృందం అధ్బుతంగా ప్రదర్శించి అందరిని ఆశ్చర్యచకితులను చేసారు. ఈ మేళాలో దోసా ప్లేస్ వారు పెట్టిన పండుగ భోజనం అందరూ ఆస్వాదించారు.

ఆ తరువాత సాయంత్రం 6:00 నుంచి మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలలో లాస్ ఏంజల్స్ మరియు దక్షిణ కాలిఫోర్నియాలోని ప్రాంతీయ కళా కారులతో వివిధ కార్యక్రమాలను నిర్వ హించారు. మేళ నుండి సాంస్కృతిక కార్యక్రమాలకు విచ్చేస్తున్న అతిథులను హరి దాసులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సాంస్కృతిక కార్య క్రమంలో 180 మంది కి పైగా ప్రాంతీయ కళాకారులు వివిధ ప్రదర్శనల తో ఆహ్వానితులను ఉర్రూతలూగించరు. ఈ కార్యక్రమం లో ” లాటా సంక్రాంతి పాట ” పాట ప్రముఖ ఆకర్షణ గా నిలిచింది . ఈ పాటను ప్రేక్షకుల కోరిక మేరకు మూడు సార్లు ప్రదర్శించడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమంలో చిన్న చిన్న పిల్ల లను మొదలుకొని పేరు పొందిన కళా కారుల వరకు అందరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాల ను ప్రతిబింభించే విధంగా పెళ్లి సందడి, కోయ డాన్సులు, లంబాడ డాన్సులను బాల బాలికలు ప్రదర్శించారు, సంక్రాంతి ప్రాముఖ్యత తెలుపుతూ హరిదాసులు , అష్ట లక్ష్ములతో కూచిపూడి నృత్యరూపకం మరియు పిల్లా పెద్దలతో కూడిన ఫాషన్ షో అందరిని ఆకొట్టుకొన్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలకు హనిష్క పోలిమెర మరియు లాటా వాలంటీర్ సమీర్ భవానిభట్ల గార్లు వాఖ్యాతలుగ వ్యవహరించారు. సాంస్కృతిక కార్య క్రమంలో పాల్గొన్న అందరు కళాకారులకు లాటా వాలంటీర్స్ చేత జ్ఞాపిక లను అందించారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారిక జ్ఞాపికలను మరియు విజేతలకు ఉప్పాడ పట్టు చీరలు మరియు జ్ఞాపికలను జాయింట్ సెక్రటరీ లక్ష్మి చిమట గారు మరియు లాటా కార్యవర్గం వారి శ్రీమతులు బహూకరించడం జరిగింది. మెగా విజేతలకు కిశోర్ కంటమనేని గారు, డాంజి తోటపల్లి గారు బహుమతులు ఇవ్వడం జరిగింది.

కార్యక్రమ చివరగా లాటా అధ్యక్షులు రమేష్ కోటముర్తి, ఉపాధ్యక్షులు రవి తిరువాయిపాటి , కోశాధికారి హరి మాదాల, ఉప కోశాధికారి శ్రీని కొమిరిసెట్టి, కార్యదర్శి తిలక్ కడియాల, ఉప కార్యదర్శి లక్ష్మి చిమట గార్లు ఆహ్వానితులు మరియు ప్రేక్షకులకు తమ ధన్య వాదాలను తెలియ చేసారు. ఈ సందర్భంగా రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేసేటందుకు రాత్రింబగళ్ళు కష్ట పడిన వాలంటీర్స్ సేవలను కొనియాడారు. ఈ రోజు కార్యక్రమానికి వచ్చేసిన అతిథిలలో 300 మందికి పైగా కొత్తగా సభ్యత్వాలను తీసుకోవడం విశేషమని సభ్యుల రిజిస్ట్రేషన్ వాలంటీర్ రామ్ యలమంచిలి గారు వివరించారు.

View full gallery here