హోరెత్తించిన లాస్ ఏంజలెస్ తెలుగు అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు

1401
లాస్ ఏంజలెస్ లో శనివారము, జనవరి 16 2016 న తెలుగు వారి సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ భావితరలకు మరుగున పడిన తెలుగు కళలను పరిచయం చేయాలనే సంకల్పం తో జోర్డాన్ హై స్కూల్ లో జరిగిన లాస్ ఏంజలెస్ తెలుగు అసోసియేషన్ మూడవ సంక్రాంతి సంబరాలు ఇక్కడి ప్రాంతీయ కళాకారుల ప్రదర్శనలతో అత్యంత వినోద భరితంగా జరిగాయి. 2000 మందికి పైగా లాస్ ఏంజలెస్ ప్రాంత తెలుగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాటా సభ్యులు చేసిన చెక్క భజన కార్యక్రమములో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. జోర్డాన్ హై స్కూల్ ఆడిటోరియం నుండి లాట వారి మేళా వీధుల వెంట లయ బద్దంగా చెక్క భజన, డప్పు శ్రీనివాస్ గారి డప్పు చప్పడు మరియు భక్తి కీర్తనలతో సాగడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఆనేక మంది ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అప్పటికప్పుడు చిడతలు తీసుకొని భజన బృందంతో చేరి నాట్యం చేయడం అందరిని అబ్బుర పరిచింది. మేళా లో 20 కి పైగా దుకాణాలలో వివిధ రకాల ఉత్పత్తులను అమ్మకానికి పెట్టడం, మేళా కి విచ్చేసిన పలువురితో ఈ దుకాణాలు నిండి పోవడం విశేషం. మేళా లో పిల్లలు ప్రదర్శించిన నృత్యాలు, రిధమ్ అండ్ మెలోడీస్ పాటలు, శ్రీకాంత్ కోచర్లకోట గారి వ్యాఖ్యానము ప్రేక్షకులను ఆకర్షించాయి.
లాటా తిరునాళ్ళలో పిల్లలు ఆటల కోసం ప్రత్యేక స్టాళ్ళ ను నిర్వహించరు. ఈ స్టాళ్ళను 37 మంది 10 నుండి 12 సంవత్సరములలోపు పిల్లలు నిర్వహించడం విశేషం. దోసా ప్లేస్ వారి 11 రకాల నోరూరించే రుచికరమైన శాఖాహార పదార్ధాలతో విందు భోజనము, ఇవన్నీ వెరసి శనివారము సాయంత్రము ఒక మధురాను భూతిని నింపింది. లాటా వారు లాస్ ఏంజలెస్ కాలమానం ప్రకారం అత్యంత సుందరంగా తయారు చేసిన 2016 తెలుగు కాలెండర్ని ప్రతి ఒక్క తెలుగు కుటుంబానికి ఉచితంగా ఇవ్వడం జరిగింది.
సాయంత్రము 6:30గంట లకు 150 మంది కి పైగా ప్రాంతీయ కళాకారులతో మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు గంగిరెద్దులు, హరిదాసులు, సన్నాయి మేళము, బుడబుక్కల, వివిధ జానపద, సినీ పాటలు, నృత్యాల తో ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమలో లాటా సభ్యుల చే ప్రదర్శించ బడిన బాహుబలి నాటకం ప్రేక్షకులను ఉర్రూతలూగించినది. చిన్న పిల్లలు చేసిన దుర్గా దేవి నాట్యంకి సభికులందరూ లేచి నిల్చోని కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియ చేసారు. ఇంకా అనేక మంది పిల్లలు మరియు పెద్దల ప్రదర్శనలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా లాటా వారు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతుల ప్రధానం మరియు విజేతలకు పట్టు చీరలను బహుకరించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడిగా తిలక్ కడియాల, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ కొమిరిశెట్టి, కార్యదర్శిగా శ్రీధర్ సాతులూరి, సహ కార్యదర్శిగా సమీర్ భావానిభట్ల, కోశాధికారిగా చక్రవర్తి కావూరి, సహ కోశాధికారిగా సురేశ్ అంబటి గార్ల తో కూడిన లాటా నూతన కార్యవర్గాన్ని సభికులకు పరిచయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తోడ్పాపడిన దాదాపు 120 మంది లాటా స్వచ్ఛంద సేవకులకు, దాతలకు, దోసా ప్లేస్ వారికి లాట యజమాన్యం వారు ప్రత్యేక ధన్యవాధాలు తెలియచేశారు.
LATA Sankranthi Mela 2016 - MEGA SUCCESS (1) LATA Sankranthi Mela 2016 - MEGA SUCCESS (2) LATA Sankranthi Mela 2016 - MEGA SUCCESS (3) LATA Sankranthi Mela 2016 - MEGA SUCCESS (4) LATA Sankranthi Mela 2016 - MEGA SUCCESS (5) LATA Sankranthi Mela 2016 - MEGA SUCCESS (6) LATA Sankranthi Mela 2016 - MEGA SUCCESS (7) LATA Sankranthi Mela 2016 - MEGA SUCCESS (8)