లాటా వారి 2017 సంక్రాంతి సంబరాలు (01/14/2017)

1228
మధ్యాహ్నం  బంతి భోజనాలు … సాయంత్రం విందు భోజనాలు…
        లాటా వారి 2017 సంక్రాంతి సంబరాలు ఇంకా కొన్ని రోజులలోనే .. ప్రతి సంక్రాంతి ని ఏదో ఒక కొత్త దనంతో , మరియు ఒక క్రొత్త కార్యక్రమంతో మీ ముందుకు రావడం ఒక అలవాటుగా చేసుకొన్న లాటా , ఈ సారి మేళాని చూడటానికి వచ్చే వారి భోజనావసరములను గుర్తించి మధ్యాహ్న భోజనాన్ని వడ్డించడానికి ప్రణాళికలను సిద్దం చేస్తుంది.
ఎప్పుడో చిన్నప్పుడు అక్కలు, అన్నయ్యలు, మామయ్యలు, అత్తయ్యలు, పెద్దలు, చుట్టాలు విస్తర్లలో వడ్డిస్తుంటే, కావల్సిన వంటల కోసం పిలిచే పిలుపులు, వడ్డించే వాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్లేదు అని ధీమాగా కూర్చునే కుర్రకారు. కొత్త బట్టలతో వచ్చాం, సాంబారుని ఎత్తి పొయ్యకు అని హెచ్చరించే ఆడవారు, ఇంకో అప్పడం కావాలా అంటూ ఓరచూపులు చేసే కుర్ర కారు,  ఇంత భోజనం పెట్టిన తరువాత ఓ కిళ్ళీ ఇస్తే మీ సొమ్మేం పోతుంది అనే పెద్దవారు…  భుక్తాయాసంతో చెట్టు నీడన అరుగుపై నడుం వాల్చే భోజన ప్రియులు… ఈ సారి అచ్చంగా మన సంక్రాంతి వేడుకలో దర్శనం ఇవ్వ పోతున్నారు…

ఇంతటి చక్కటి, మధురమైన భోజనము ఈ సంక్రాంతి సంబరాల్లో జనవరి 14 మధ్యాహ్నము 12:30 నుండి 1:30గం|| ల వరకు మాత్రమే.. మర్చి పోకుండా త్వరగా వచ్చి  మా విందు ని స్వీకరించి, మేళాలో ఆడి, పాడి, దుకాణాలలో మీకు కావలసిన వస్తువులను కొని,  రాత్రి వరకు జరిగే ఆట, పాటలు, విందు, వినోదాల తో  మీ సంక్రాంతి ని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకోండి.

సంబరాల సంక్రాంతిని అంబరాన్ని తాకించేందుకు  మీరు సకుటుంబ సపరివార సమేతంగా  వచ్చి సంక్రాంతి ని ముందు తరాలకు తీసుకు వెళ్ళేందుకు దోహద పడండి.
sankranthi-01-14-2017-afternoon-banthi-bhojanalu-evening-vindu-bhojanalu