తిరుపతి సభలో సెహ్వాగ్ సచిన్లను తలపించిన జేపి,సిరివెన్నెల

1712

తిరుపతి 3 మార్చి : ఓ వైపు DR.జేపి తన అపారమైన వాక్చాతుర్యంతో  రాయలసీమవాసులు  ఏమి నష్టపోయారో, సీమకు ప్రత్యేక ప్రతిపత్తి కోసం కేవలం ఒక్క MLA వున్న లోక్ సత్త పార్టీ ఎలా పోరాడి గెలిచిందో, మిగితా 293 మంది ఎలా విఫలమయ్యారో, తిరుపతి బహిరంగ సభలో పూస గుచ్చినట్టు చెప్తుంటే మరో వైపు” తెల్లారింది లెగండోయ్ కొక్కొరోక్కో, మంచాలిక దిగండోయ్ కొక్కొరోక్కో ” అంటూ తనదైన శైలిలో జనాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.

జేపి గారు తనకు చిరకాల మిత్రుడని , ముందు జేపి రాజకీయల్లోకి రావటం ఇష్టపడక పోయినా తరువాత అది ఎంత అవసరమో గుర్తించానని చెప్పారు. మీరందరూ మరో జేపి అయి నడవాలని, కేవలం సైనికులైతే సరిపోదని అక్కడి  ప్రజలను ఉద్దేశించి అన్నారు. లోక్ సత్తాలో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా వుంటుందో వేచి చూడాలి మరి.TptLsp_JP Tpt_LspStage TptLspSirivennela TptLspCrowd