సీఎం రిలీఫ్ ఫండ్ కు తొలి విడత గా రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం *** తుపాను బాధితుల ఆదుకునేందుకు నాట్స్ ముందడుగు

1089
తుపాను బాధితుల ఆదుకునేందుకు నాట్స్ ముందడుగు… ప్రవాస తెలుగువారంతా స్పందించాలని నాట్స్ పిలుపు
 
తెలుగుజాతికి ఏ కష్టమోచ్చినా ఆండగా నిలిచేందుకు ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ హుద్ హుద్ తుపాను బాధితులను ఆదుకోవాలని నిశ్చయించింది. తుఫాను బీభత్సంతో కకావికలమైన ఉత్తరాంధ్రలో  బాధితులకు అండగా నిలిచేందుకు..వారికి సాయమందించేందుకు నాట్స్ హెల్ఫ్ లైన్  విరాళాల సేకరణకు నడుంబిగించింది. ప్రవాస తెలుగు వారంతా తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తోంది. ముందు తన వంతు బాధ్యతగా తొలి విడతగా 5 లక్షల రూపాయల విరాళాన్ని నాట్స్ బోర్డ్ సీఎం రీలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని నిర్ణయించుకుంది. నాట్స్ ఇచ్చిన పిలుపుకు ఎప్పుడూ ప్రతిస్పందించే దాతలతో పాటు తెలుగువారంతా సాటి కష్టాల్లో ఉన్న తెలుగువాళ్ల కోసం స్పందించాలని నాట్స్ కోరుతోంది. విరాళాలు ఇచ్చేందుకు
నాట్స్ వెబ్ సైట్ లో సంప్రదించండి.. నాట్స్ వెబ్ లింక్ ..