న్యూయార్క్ నగరములో తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది

1335

అమెరికాలోని న్యూయార్క్ నగరములో తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టి .ఎల్. సి .ఏ ) ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస్ గూడూరు గారి అధ్యక్షతన శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను న్యూయార్క్ తెలుగు వారందరు కలసి ఘనంగా జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో ప్రత్యేకంగా అలంకరించిన వేదిక మరియు శ్రీ సీతా రాముల వారి కల్యాణ మండపము అలంకరణ అచ్చమైన తెలుగింటి సంప్రదాయాన్ని గుర్తుచేశాయి . ఉగాది పచ్చడి మరియు భద్రాద్రి నించి ప్రత్యేకంగా తెప్పించిన పవిత్రమైన స్వామి వారి ప్రసాదములను అతిధులు భక్తీ శ్రద్ధలతో స్వీకరించారు.

కార్యదర్శి అశోక్ చింతకుంట కార్యక్రమాన్ని ప్రారంభించగా అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు, కల్చరల్ కమిటీ కి నేతృత్వము వహించిన ఉమారాణి పోలిరెడ్డి మరియు కమిటీలోని సభ్యులు ప్రసాద్ కోయి , డా. జ్యోతి జాస్తి , జయప్రకాశ్ ఇంజపురి అతిథులకు ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియచేశారు. లోకల్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ, గురువులు సాధన పరాన్జీ, సత్యప్రదీప్, సావిత్రి రమానంద్, మాధవి కోరుకొండ మరియు ఉమా పుటానే నేతృత్వంలో ప్రత్యేకంగా రూపొందించబడిన పిల్లలు ప్రదర్శించిన నృత్యాలు, నాటకాలు, కూడిపూడి, భరతనాట్యములు ప్రేక్షకులను ఎంతో అలరించాయి.

కమ్యూనిటీలోని యువతలోని స్మృజనాత్మకతను వెలికితీయటానికి పెద్దపీటవేస్తూ బాబు కుదరవల్లి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రదర్శించిన టి .ఎల్. సి .ఏ యూత్ ప్రోగ్రాం ప్రేక్షకుల అభినందలు అందుకుంది. ఈ సంవత్సరం యూత్ పై భాగస్వామ్యాన్ని పెంచి వారి నేతృత్వంలోనే కార్యక్రమాలను రూపొందించి వారే సొంతంగా నిర్వహించుకునే విధంగా శ్రద్ధ తీసుకుంటున్నామని అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు తెలియచేసారు.

TLCA Hevalambi ugadi celebrations (1) TLCA Hevalambi ugadi celebrations (2) TLCA Hevalambi ugadi celebrations (3) TLCA Hevalambi ugadi celebrations (4) TLCA Hevalambi ugadi celebrations (5)

అలాగే గత కొద్ది సంవత్సరాలుగా వేదికకు దూరమైన తెలుగు పౌరాణిక నాటకాల్ని ఈ సంవత్సరం పునరుజ్జీవంప జేసామని అధ్యక్షులు శ్రీనివాస్ తెలియ జేశారు. తమ అభ్యర్ధన మేరకు అశోక్ చింతకుంట గారి నిర్వహణలో, ప్రసాద్ డబ్బీరు గారి దర్శకత్వంలో, టి .ఎల్. సి .ఏ సభ్యులచే ప్రదర్శించిన దక్ష యజ్ఞం నాటకము ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సందర్భంగా పదేళ్లకు పైగా కమ్యూనిటీ లోని కళాకారులకి మేకప్ సేవలు అందించిన శ్రీమతి మాధవి సోలేటి గారిని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. ఈసంవత్సరం టి .ఎల్. సి .ఏ సంక్రాంతి మరియు ఉగాది వేడుకల్లో అమెరికాలోని లోకల్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ రూపొందించిన ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా రక్తి కట్టాయని ప్రేక్షకులు అభినందించారు.

ఈ వేడుకలలో మద్దిపట్ల ఫౌండేషన్ వారు ఉగాది మరియు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియ చేస్తూ గంట గంటకు రాఫిల్ ద్వారా ప్రేక్షకులకు ఉచిత బహుమతులు అందించారు.

పండితులు శ్రీ హనుమంత రావు గారు ఉగాది పంచాంగ శ్రవణము మరియు శ్రీరామనవమి సందర్బంగా ప్రత్యేక పూజ చేసి, కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీ హేవళంబి నామసంవత్సరంలో మంచి జరగాలని ఆశీర్వదించారు.

డా. జ్యోతి జాస్తి గారు నిర్వహించిన కమ్యూనిటీ ప్రోగ్రాం లో ముఖ్య అతిధులు జార్జ్ మార్గోస్ (కంప్ట్రో లర్, నాసా కౌంటీ), దిలీప్ చౌహన్ (డైరెక్టర్, సౌత్ ఆసియా అఫైర్స్, నాసా కౌంటీ) కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగింస్తూ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వివక్ష పూరితమైన సంఘటనల గురించి వివరిస్తూ ఏదైనా వివరాలు/సహాయము కావాలంటే వారిని కలుసుకోవచ్చని చెప్పారు.

ప్రసాద్ కోయి ఎడిటర్ గా వ్యవహరించిన ఉగాది ప్రత్యేక సంచికను అధ్యక్షుని వినూత్న ఆలోచనలకి అనుగుణంగా పిల్లలు, పెద్దల నుండి తెలుగు కథలు, సూక్తులు, చేత్తో గీసిన బొమ్మలు సేకరించి, అమెరికాలోని డాక్టర్లు, ఐటీ కంపెనీలు మరియు ఇతర కంపెనీల వివరాలని పొందుపరచి ముద్రించారు. ఈ సంచిక కమిటీ సభ్యులైన ఉమారాణి పోలిరెడ్డి, డా. జ్యోతి జాస్తి , జయప్రకాశ్ ఇంజపురి, బాబు కుదరవల్లి,

డా. ధర్మారావు తాపి, కార్యదర్శి అశోక్ చింతకుంట, అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు మరియు ముఖ్య అతిధులు జార్జ్ మార్గోస్ (నాసా కౌంటీ కంప్ట్రో లర్ ), దిలీప్ చౌహన్ (డైరెక్టర్ సౌత్ ఆసియా అఫైర్స్ నాసా కౌంటీ), ఫార్మా కంపెనీల అధినేత డా. పైల్ల మల్లారెడ్డి, టీవీ5 అధినేత శ్రీధర్ చిల్లర గార్ల తో ఆవిష్కరించారు.

ఈ సంవత్సరం అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు గారు ప్రవేశ పెట్టిన “ప్రతిభకి పట్టాభిషేకం” కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని తెలుగు వారి లో అద్వితీయమైన ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి గౌరవిస్తారు. ఈ ఉగాది వేడుకలలో సాహిత్యశ్రీ తాపి (భరతనాట్యము, కూచిపూడి) మరియు సంజయ్ జొన్నవిత్తుల (స్వర సంగీతం) ని గుర్తించి టి .ఎల్. సి .ఏ తరపున ముఖ్య అతిధి జార్జ్ మార్గోస్ (నాస్సు కౌంటీ కంప్ట్రో లర్ ) ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య దాతలైన డా. పైల్ల మాల్లారెడ్డి , డా. పూర్ణ అట్లూరి, కృష్ణ మద్దిపట్ల మరియు కుమారస్వామి రెడ్డి మారూరి గార్లను ముఖ్య అతిధి జార్జ్ మార్గోస్ (నాస్సు కౌంటీ కంప్ట్రో లర్) ఘనంగా సత్కరించారు.

టి .ఎల్. సి .ఏ బోర్డు చైర్మన్ డా. రాఘవరావు పోలవరపు మరియు టి .ఎల్. సి .ఏ అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు గార్లు న్యూయార్క్ తెలుగు కమ్యూనిటీకి చేస్తున్నవిశిష్ట సేవలకుగాను వారిని నాసా కౌంటీ కంప్ట్రో లర్ విశిష్ట పురస్కారంతో గౌరవించారు.

అమెరికాలోని లోకల్ టాలెంట్ ని ప్రత్యేకంగా ప్రోత్సాహించే ద్యేయాన్ని కొనసాగిస్తూ, టి .ఎల్. సి .ఏ వర్జీనియా నుండి ప్రత్యేకంగా ఆహ్వానించిన వర్ధమాన గాయని గాయకులు అనన్య పెనుగొండ, అనీష్ మణికొండ ,కాశ్యప్ వెనుతురుపల్లి, వివేక్ పాలెపు అద్భుతంగా గానం చేసి ప్రేక్షకులచే శభాష్ అనిపించుకున్నారు.

లైవ్ ఆర్కెస్ట్రా తో దర్శకులు/గాయకులు రఘు కుంచె, గాయకులు ప్రసాద్ సింహాద్రి, గాయని ఉష పాటలతో ప్రేక్షకులని ఉర్రుతలూగించారు.

భోజన కమిటీ కి నేతృత్వము వహించిన నెహ్రు కటారు మరియు సభ్యులు సురేష్ బాబు తమ్మినేని గార్లు పసందైన ఉలవచారుతో బాటు చక్కని తెలుగు విందు భోజనం అందించారని ప్రేక్షకులు మెచ్చుకున్నారు.

టి .ఎల్. సి .ఏ బోర్డు మరియు కార్యవర్గము ప్రోగ్రాంకి విచ్చేసిన కళాకారులను, ఆర్కెస్ట్రా ని, ఇండియా మీడియా ఐకాన్, TV5 అధినేత శ్రీధర్ చిల్లరను ఘనంగా సత్కరించారు

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్య కారకులైన దాతలకు, గురువులకు, కోరియోగ్రాఫర్స్ లకు, మీడియా పార్టనర్స్ TV5 కి, యావత్తు కార్యవర్గానికి అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు.

జాతీయ గీతం తో కార్యక్రమాన్ని ముగించారు.