కెనడా లో తాకా వారి హేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు

1487

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) వారి ఆధ్వర్యములో ఏప్రిల్ 1 వ తేదిన శనివారం మిస్సిసాగా నగరంలోని  పోర్ట్ క్రెడిట్ సెకండరీ స్కూల్ లో ఉగాది వేడుకలు దాదాపు 1100 మందికి పైగా తోటి తెలుగు వారి తో కన్నుల పండుగ గా జరిగాయి. ఈ వేడుక  సాంస్కృతిక  కమిటీ శ్రీ  అరుణ్ లయం, మరియు శ్రీమతి దీప సాయిరాం  ఆద్వర్యం లో అచ్చ తెనుగు సాంప్రదాయ పద్ధతులతో దాదాపు 6 గంటలు పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల తో సభికులను అలరించాయి. పండిట్ శ్రీ సూర్యనారాయణ అద్దేపల్లి గారు హేవళంబి నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేయగా, శ్రీమతి లక్ష్మి దుగ్గిన గారు ఉగాది పచ్చడి అందరికి అందచేశారు.

taca_ug_barat taca_ug_deepika taca_ug_janapadam taca_ug_laka taca_ug_lavakusa taca_ug_mla

తాకా  కార్యదర్శి శ్రీ లోకేష్ చిలుకూరు గారు  ఆహ్వానించగా,  శ్రీమతి లక్ష్మి దుగ్గిన, శ్రీమతి దీప సాయిరాం, శ్రీమతి గాయత్రి , శ్రీమతి వైశాలి శ్రీధర్ , మరియు  శ్రీమతి కల్పన మోటూరి గార్లు జ్యోతి ప్రజ్వలన చేయగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉగాది వేడుకలలో దాదాపు వంద మంది టొరంటోలో నివసిస్తున్న చిన్నారులు, యువత మరియు పెద్దలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ వేడుకలో కూచిపూడి, భరత నాట్యం, కథాకళి , జానపద, సినిమా గీతాలు, నృత్యాలు, మరియు నాటికలు చిన్న పిల్లల నుండి పెద్దల వరుకు పాల్గొని ప్రేక్షకులను వారి ప్రతిభ సామర్ధ్యాలతో ఉర్రుతలూగించారు. ఈ  కార్యక్రమానికి మిస్సిసాగా M.P.P దీపిక దామెర్ల గారు మరియు టొరంటో  వైస్ కాన్సుల్  జనరల్ ఉష వెంకటేశం  గార్లు ముఖ్య అతిధిగా హజరయ్యరు.  తాకా  అద్యక్షులు  శ్రీ హనుమంతాచారి సామంతపూడి గారు  తాకా పురస్కారముల ప్రాస్తవ్యాన్ని, తాకా వ్యవస్తాపకతను, ఆవశ్యకతను మరియు భవిష్యత్తు ప్రణాళికను  వివరించారు. తాకా  వారు  ఉగాది వేడుకల సందర్బంగా  గ్రేటర్ టొరంటో ఏరియాలో బారతీయ బాషలు, సంస్కృతి, విద్య, క్రీడలు, సంఘ సేవ మొదలగు విషయాల లో సేవ చేస్తున్న మంత్రి వర్యులు శ్రీమతి దీపికా దామెర్ల, శ్రీమతి వినయ్ దేవిశెట్టి (క్రీడలు), శ్రీమతి నళిని దేవినేని (తెలుగు బాష), మరియు శ్రీమతి అనురాధ పెంట (తెలుగు బాష ) గార్ల ను ఈ సంవత్సరపు తెలుగు పురస్కారములుతో తాకా అద్యక్షులు  శ్రీ హనుమంతాచారి సామంతపూడి , ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రమేష్ మునుకుంట్ల, బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ శ్రీ అరుణ్కుమార్ లయం, వ్యవస్థాపక సభ్యుదు శ్రీ రామచంద్ర రావు దుగ్గిన  సత్కరించారు. తాకా ట్రస్టీ సభ్యులు శ్రీ బాష షేక్, శ్రీమతి వైశాలి శ్రీధర్, కోశాధికారి శ్రీ భాను పోతకమూరి గార్లు, డైరెక్టర్స్  శ్రీమతి కల్పన  మోటూరి, శ్రీ నాగేంద్ర హంసాల సాంస్కృతిక కార్యక్రమాల లో పాల్గొన్న వారికి, మరియు మార్చిలో జరిగిన తాకా ఆటల పోటీల లో పాల్గొన్న వారికీ బహుమతులు అంద చేసారు.  తాకా వేడుకను మరియు క్రీడల పోటీల ను జరుపటకు ఆర్హిక సహాయం చేసిన జయశ్రీ కన్నన్ మరియు రావు బొప్పన గార్ల ను శ్రీ లక్ష్మినారాయణ సూరాపనేని గారు జ్ఞాన దీపికాలు అంద చేసారు. తాకా వారు ప్రత్యేకంగా తయారు చేపించిన పిండివంటలతో  ఉగాది విందుని ఏర్పాటు చేసారు. తాకా వ్యవస్థాపక సభ్యుడు శ్రీ రవి వారణాసి అధ్వర్యం లో ఏర్పడిన తాకా కొత్త వెబ్ సైట్ ను ఈకార్యక్రమం లో విడుదల చేసారు.

taca_ug_red taca_ug_trophies taca_ug_voni taca_ugad_kids taca_ugad_white taca-ug_deepa_grp

ఈ వేడుకను ఎంతో అద్భుతం గా చేపట్టి మరియు విజయవంతము చేసిన తాకా కోశాధికారి శ్రీ భాను పోతకమూరిని, ఫుడ్ కమిటీ ఇంచార్జి శ్రీమతి కల్పనా మోటూరిని మరియు శ్రీ వీరాంజనేయులు కోటను , కల్చరల్ ఇంచార్జి శ్రీమతి దీప సాయిరాంని, వాలంటీర్స్ ఇంచార్జి  శ్రీ నాగేంద్ర హంసల ను తాకా అద్యక్షులు అభినందించారు. ఈ కార్యక్రమం లో తాకా  వ్యవస్థాపక సభ్యులు శ్రీ శ్రీనాథ్ కుందూరి , శ్రీ గంగాధర్ సుఖవాసి, శ్రీ రామచంద్ర రావు దుగ్గిన లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.  చివరిగా అందరికి ధన్యవాదాలు చెపుతూ జనగణమన జాతీయగీతంతో కార్యక్రమాన్ని ముగించారు.