దుబాయ్ వాసవి యూత్ NRI ఆధ్వర్యంలో ఘనంగా కార్తీకమాస వన భోజనాలు

1336

దుబాయ్ వాసవి యూత్ NRI ఆధ్వర్యంలో కార్తీకమాస వన భోజనాలు అంగ రంగ వైభవంగా 31 అక్టోబర్ 2014 శుక్రవారము జబీల్ పార్క్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రప్రధమ ఆర్యవైశ్య M.L.A శ్రీ బిగల గణేష్ గుప్తా గారు , వారి సతీమణి లత గుప్తా గారు మరియు ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటులు , ఆర్యవైశ్య ప్రముఖులు అయినటువంటి శ్రీ గుండు హనుమంతరావు గారు ప్రత్యేక అతిధులుగా విచ్చేశారు . U.A.E. Dubai లో జరిగిన ఈ కార్యక్రమానికి 750 కి పైగా ఆర్య వైశ్యులు పాల్గొన్నారు .

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు వాసవి యూత్ NRI వారు పలు ఆసక్తికరమైన ఆటలతో పాటు, ఫేస్ పైయింటింగ్, గోరింటాకు , బెలూన్ మేకింగ్ , మ్యాజిక్ షో, మహిళలకు ప్రత్యేకంగా పట్టుకుంటే పట్టుచీర వంటి కార్యక్రమాలే కాకుండా నోరూరించే తెలుగు వంటకాలతో విందు భోజనం , ప్రత్యేకంగా ఉలవచారు బొబ్బట్టు ఏర్పాటు చేసారు . ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ M.L.A శ్రీ బిగల గణేష్ గుప్త గారు వారి శ్రీమతి లత గుప్తా గార్లకు మరియు శ్రీ గుండు హనుమంత రావు గారిని దుబాయ్ వాసవి యూత్ NRI కార్యవర్గం అత్యంత ఘనంగా సన్మానించారు మరియు దుబాయిలో వివిధ రంగాలలో సేవా కార్యక్రమం నిర్వహిస్తోన్న ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీ యలమర్తి శరత్ గారిని , లాయర్ అనురాధ బొబ్బిలిశెట్టి గారిని , సోని కిరణ్ గారిని బిగల్ గణేష్ గుప్తా గారు సన్మానించారు, గుండు హనుమంతరావు గారు అభినందించారు .dubai vasavi youth NRI vana bhojanalu (2) dubai vasavi youth NRI vana bhojanalu (3) dubai vasavi youth NRI vana bhojanalu (4) dubai vasavi youth NRI vana bhojanalu (5) dubai vasavi youth NRI vana bhojanalu (6) dubai vasavi youth NRI vana bhojanalu (7)

శ్రీ గణేష్ గారు మాట్లాడుతూ వాసవి యూత్ NRI పలు సేవలతో ఒక విధం గా ఆర్ధికమగా వెనుకబడిన ఆర్యవైశ్య విద్యార్ధులను చదివించడం అభినందనీయం అని సంస్థ ప్రతినిధులైన జూలూరు వెంకట సురేష్ కుమార్ , జయేష్ కొప్పర్తి , రఘురాం సందీప్ దిగ్గవల్లి ని ప్రశంసించారు . జూలూరు సురేష్ ని ప్రత్యేకంగా అభినందించారు . ఈ సంస్థ గత 8 నెలలలో రెండు కార్యక్రమాలను చాలా ఘనంగా నిర్వహించింది . ఈ సంస్థ రానున్న 4,5 సంవత్సరాలలో Gulf conuntry లో తన కార్యకలాపాలను విస్తరించాలి అని కోరారు.

గుండు హనుమంతరావు గారు మాట్లాడుతూ ఆర్యవైశ్య కళాకారులకు , రాజకీయ నాయకులకు వ్యాపారస్థులకు మరియు వివిధ రంగాలలో సేవలందిస్తున్న ఆర్యవైష్యులను ప్రోత్సహించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. అలాగే ఆర్యవైశ్య విద్యార్దులను చదివించడం కూడా అభినందనీయమని , ఈ సంస్థ ఇలాగే మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని ఆశిస్తున్నానని తెలియచేసారు.

ఈ కార్యక్రమం కార్యవర్గ సభ్యులైన జయేష్ కొప్పర్తి , రఘురాం సందీప్ , జూలూరు సురేష్ లు విచ్చేసిన అతిధులకు , sponsor లకు కృతజ్ఞతలు తెలియచేస్తూ రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు, సేవలు చేస్తాము అని తెలియచేసారు . జూలూరు హారిక , monisha ,నరసింహారావు , అనిత, అవినాష్ , దీపు , ప్రణీత్ , రాజేష్, ప్రదీప్ , సంధ్య , జయప్రద , విష్ణు , జూలూరు దినేష్ , నళిని జూలూరు , కిశోర్ , నాగార్జునలు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందచేసారు .