చికాగోలో డిట్రాయిట్ తార మెరుపులు – శ్రీచందన అనుమోలు

1703
డెట్రాయిట్ తార చికాగో లో మెరిసింది. ఈమధ్య అద్భుతంగా జరిగిన నాట్స్ సంబరాల వేడుకలలోని కార్యక్రమాలను చూస్తూన్న ఒక ప్రముఖ సంగీత దర్శకునితో ఇదంతా మొదలయింది. అత్యంత ప్రతిభాశాలి అయిన ఒక డిట్రాయిట్ బాలిక ఆ సంగీత దర్శకుని విభావరిలో పాడటం దగ్గర ముగిసింది. వారిద్దరి ఈ కలయిక చికాగోలో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.  ఆ సంగీత దర్శకుడు తెలుగు సంగీత ప్రియులందరికీ సుపరిచితులయిన శ్రీ అనూప్ రూబెన్స్ అయితే ఆ అమ్మాయి మన డిట్రాయిట్ ధృవతార మన శ్రీచందన అనుమోలు.
Detroits Little Start SHINES in Chicago (1)
వివరాల లోకి వెళితే, నాట్స్ వేడుకలలో, శ్రీ చందన గాత్ర ప్రదర్శన వీడియో లని, అనూప్ రూబెన్స్  అనుకోకుండా చూడడం, ఆమె కి గాయని గా మంచి భవిష్యతు వుందని NATS Board of Directors దగ్గర ప్రస్తావించడం జరిగింది.  శ్రీ చందన ఎవరో ఏమిటో తెలియక పోయినా, NATS Board of Directors, వెంటనే డెట్రాయిట్ నాట్స్ బృందాన్ని  సంప్రదించి, అనూప్ రూబెన్స్ స్పందనని చెప్పడమే కాక, నాట్స్ ద్వారా ఈ చిరు తారని సంగీత ప్రపంచంతో కలపాలని, ప్రోత్సాహం ఇచ్చారు.  మొగ్గ దశ లో వున్న  శ్రీ చందన లాంటి గాయనిలకి అనూప్ రూబెన్స్ లాంటి పేరు గాంచిన సంగీత దర్శకులని కలవడమే కష్టం అనుకుంటే, ఇదే సమయంలో అనూప్ గారు అమెరికా లోనే నాట్స్ మరియు పీపల్స్ మీడియా తరుఫున సంగీత విభావరి ఇస్తూ, సంచరిస్తుండం వల్ల, సరియైన చిరునామా దొరకడం అసాధ్యమే. కాని నాట్స్ president ఆచంట రవి, NATS Board of Directors, కృషి వల్ల, అనూప్ చిరునామానె కాదు, శ్రీచందన చికాగో లో రూబెన్స్ ముందు ప్రదర్శించే అవకాశo వచ్చింది. ఈ ప్రదర్శన లో శ్రీ చందన “చిన్నదానా నీకోసం” లో నుంచి ప్రజాదరణ పొందిన “ముందుగానే” పాట పాడి, శ్రోతలని అలరించడమే కాక, రూబెన్స్ సంగీత విభావరి లో చోటు సంపాదించింది. నాట్స్ చొరవ తో ఈ డెట్రాయిట్ చిన్నారి సంగీత ప్రపంచం లో తన తొలి అడుగు వేసింది.
Detroits Little Start SHINES in Chicago (3)
ఈ విజయానికి మూల కారణమైన NATS Board of Directors, NATS President ఆచంట రవి మరియు విశ్వప్రసాద్ గార్లకి శ్రీ చందన తల్లి తండ్రులు అనుమోలు నాగేశ్వర రావు , సూర్య కళ కృతజ్ఞతలు తెలియ చెప్తూ, “నాట్స్ బృందం తమ వ్యాపార పనుల్లో తల మునకలుగా ములిగివున్న, ఏ వేళ లోనైన సహాయానికి వెనుకాడక, శ్రీ చందన కి గాయని గా అవకాశo దొరికేంతవరకు అన్ని మార్గాలని అన్వేషించడం వల్లనే” చందన  భవిష్యత్ మార్గం సుగమం అయ్యిందని కొనియాడారు. చికాగో లో వున్న  Sridhar Mumgandi, Nagender Vege గార్లకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియ చేసారు.  Detroits Little Start SHINES in Chicago (5)