సి.పి.బ్రౌన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

1610

సి.పి.బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. తెలుగు భాషకు చేసిన సేవ వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు.

1841లో “నలచరిత్ర”ను ప్రచురించాడు. “ఆంధ్రమహాభారతము”, “శ్రీమద్భాగవతము” లను ప్రచురించాడు. తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు. 1840లో వ్యాకరణాన్ని ప్రచురించాడు.

లండన్లోని “ఇండియాహౌస్ లైబ్రరీ”లో పడి ఉన్న 2106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు. “హరిశ్చంద్రుని కష్టాలు” గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు.

1844లో “వసుచరిత్”‘, 1851లో “మనుచరిత్ర” ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు. 1852లో “పలనాటి వీరచరిత్ర” ప్రచురించాడు.

telugu community news - cp brown