పీ.జే.శర్మ, చక్రి కుటుంబాలకు నాట్స్ ప్రగాఢ సంతాపం

1117
పీజే శర్మ, చక్రి కుటుంబాలకు  నాట్స్ ప్రగాఢ సంతాపం
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన రెండు విషాద వార్తలు తమను ఎంతో కలిచివేశాయని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ పేర్కొంది. దాదాపు 500 సినిమాలకు డబ్బింగ్ చెప్పటంతో పాటు నటుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పీ.జే.శర్మ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.. సాయికుమార్ కుటుంబానికి నాట్స్ తన ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. అయితే దీని నుంచి తేరుకునేలోపే ఆకస్మాత్తుగా మరో వార్త అమెరికాలో తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని నాట్స్ తెలిపింది. వర్థమాన సంగీత దర్శకుడు చక్రి గుండె పోటుతో మరణించారనే వార్త విని తామంతా షాక్ అయ్యామని నాట్స్ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. చక్కటి సంగీతంతో తెలుగు వారి మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చక్రి నాలుగు పదుల వయసులోనే మరణించడం నిజంగా తెలుగు సినీ జగత్తుకు తీరని లోటుగా నాట్స్ అభివర్ణించింది. చక్రి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. 
chakri