ఎస్. ఐశ్వర్య గారి కర్ణాటక సంగీత కచేరీ

1010
ఎస్. ఐశ్వర్య గారు కర్ణాటక సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. భారతరత్న ఎం. ఎస్. సుబ్బులక్ష్మిగారి ముని మనుమరాలీమె. నాలుగేళ్ళ వయసులో సుబ్బులక్ష్మి గారి వద్ద, బామ్మ గారు డా. రాధా విశ్వనాధన్ గారి వద్దా స్వరాభ్యాసం ప్రారంభించారు. కర్ణాటక కళాశ్రీ విదుషి జంబు కణ్ణన్ గారి వద్ద గతపధ్నాలుగేళ్ళుగా కర్ణాటక సంగీతాభ్యాసం చేస్తున్నారు. పండిట్ నగరాజారావ్ హవల్దార్, ఓంకార్నాథ్ హవల్దార్ గార్లు ఈమె హిందుస్థానీ సంగీత గురువులు.  విద్వాన్ శ్రీ. ఎ. శంకరమన్ గారి వద్ద ఐశ్వర్య గారి వీణాభ్యాసం. ప్రముఖ వాయులీన విద్వాంసులు, నాదయోగి శ్రీ. వి.వి. సుబ్రహ్మణ్యం గారు ఈమెకి ప్రస్తుత మార్గ నిర్దేశిక గురువులు.

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి 91వ జన్మదిన వేడుక సందర్భంగా తన బామ్మ గారు శ్రీమతి రాధా విశ్వనాథన్ గారి సంగీత కచేరీలో గాత్ర సహాయకురాలిగా ఐశ్వర్య గారి కచేరీ జీవితం ప్రారంభమయింది. ప్రతీ ఏటా డిసెంబరులో జరిగే మద్రాసు సంగీతోత్సవాలలో ఈమె కచేరీలు పరిపాటి. అందులో అన్ని ప్రముఖ సభలలోనూ కచేరీలు చేసారీవిడ. దేశ విదేశాలలో 400కు పైచిలుకు కచేరీలు చేసిన అనుభవం ఐశ్వర్యగారిది.

గత సంవత్సరం సుబ్బులక్ష్మిగారి శతజయంతి సందర్భంగా అమెరికాలో 30 కచేరీలు చేసి సంగీత ప్రియులనలరించిన ఐశ్వర్య గారు లాటా వేదికగా చేసే కచేరీకి విచ్చేసి ఆమె గానామృతాన్ని ఆస్వాదించగలరని ఆశిస్తున్నాము.
Carnatic music concert by S. Aishwarya on Sunday evening at Jain temple, Buena park
తేది:          ఆదివారము, ఏప్రిల్ 16, 2017
స్థలము: Jain Center of Southern California
 8072 Commonwealth Ave, Buena Park, CA 90621
రుసుము:  $5 – సభ్యులకు
                $10 – ఇతరులకు
                పిల్లలు 3సం|| కన్నా తక్కువ వారికి ఉచితం