కెనడాలో అత్యంత వైభవంగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం

1311

తెలంగాణ కెనడా సంఘం అద్వ్యర్యంలో తేది 7 జూన్ 2014 శనివారం రోజున మిస్సిస్సౌగలోని గ్లెన్ ఫారెస్టు సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో తెలంగాణ ఆవిర్బావాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబురాల్లో 900 పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేసారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యాథితిగా కెనడాలోని భారత ప్రభుత్వ రాయబారి శ్రీ అఖిలేశ్ మిశ్రా గారు విచ్చెసి నూతన తెలంగాణ నిర్మాణంలో కెనడా లోని తెలంగాణ ప్రవాసులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మొదటగా తెలంగాణ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించిన తర్వాత ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ వేడుకలో తెలంగాణ అమరవీరుల బుర్రకథ మరియు ఎన్నో వివిద సాంస్క్రుతిక కార్యక్రమాలతొ దాదాపు 6 గంటలపాటు సభికులను అలరించాయి. Telangana canada 1 Telangana canada 3 Telangana canada 4 Telangana canada 5 Telangana canada 6

ఈకార్యక్రమాలన్నీ స్తానిక తెలంగాణ వారు చక్కటి తెలంగాణ భానిలో ప్రదర్శించటం విశేషం.

Telangana canada

 

సభికులందరికి తెలంగాణ కెనడా అసోసియేషన్ రుచికరమైన తెలంగాణ వంటకాలతో భోజనాలు ఏర్పాటుచేశారు

ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ కోఆర్డినేటర్సు శ్రీ కుందూరి శ్రీనాధ్, శ్రీ కోటెశ్వరరావు చిత్తలూరి మరియు శ్రీ చంద్రస్వర్గం గారలు ఇతర ముప్పదిమంది వాలంటీర్సు సహకారంతో నిర్వహించగా శ్రి రమేశ్ మునుకుంట్ల సమన్వయపరిచారు.