ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్ – శ్రీ సుశ్రీ శ్వేతా షాలిని

989
జూన్ ,13 , 2017 ,న్యూ జెర్సీ : ఈ రోజు ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ  అద్వర్యంలోమీట్ అండ్ గ్రీట్ సమావేశం న్యూ జెర్సీలోని రాజ్ భోగ్  రెస్టారెంట్లో  జరిగింది . ఈ కార్యక్రమంలో శ్రీ సుశ్రీ శ్వేతా షాలిని  గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శ్రీ శ్వేతా షాలిని గారు  ప్రస్తుతం మహారాష్ట్ర బిజెపీ  అధికార ప్రతినిధి గా సేవలందిస్తున్నారు. 
 
శ్రీ షాలిని  గారు ఈ సందర్భముగా కేంద్రంలో ఉన్న శ్రీ మోడీ  గారి ప్రభుత్వం చేపట్టుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి , మరియు , దేశంలో నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితులను గురించి వివరించారు. అలాగే మహారాష్ట్రలోని  శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారి ప్రభుత్వం చేపట్టుతున్న వివిధ  అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు . గత ప్రభుత్వాల పని సంస్కృతిని ఎప్పుడు ఉన్నటువంటి బిజెపీ ప్రభుత్వాల పని తీరుకి ఉన్న వ్యత్యాసాన్ని వారు ప్రవాస భారతీయులకు వివరించారు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వ రైతు రుణ మాఫీ గురించి కూడా వివరించారు. 
ఈ సందర్భంగా  ప్రవాస భారతీయులు అడిగిన పలు ప్రశ్నలకు శ్రీ శ్వేతా షాలిని గారు జవాబులు ఇవ్వడం జరిగింది. ముఖ్యముగా రైతుల సమస్యలపై అడిగిన ప్రశ్నలకు షాలిని గారు సువివరముగా సమాదానాలు చెప్పడం జరింగింది. 
 
తెలంగాణ మరియు మహారాష్ట్ర లో రైతు ఆత్మహత్యల గురించి అడగగా , షాలిని గారు దానికి గల కారణాలు ను చాల విపులముగా జవాబు చెప్పారు.
 
ఈ కార్యక్రమానికి , ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు, ఓఎఫ్ బిజెపీ మాజీ జాతీయ అధ్యక్షులు శ్రీ జయేష్ పటేల్,  ఓఎఫ్ బిజెపీ జాతీయ మండలి సభ్యులు శ్రీ కల్పన శుక్ల, ఓఎఫ్ బిజెపీ  న్యూ జెర్సీ కోఆర్డినేటర్ శ్రీ అరవింద్ పటేల్ గారు, ఓఎఫ్ బిజెపీ  న్యూ జెర్సీ కో- కోఆర్డినేటర్లు  శ్రీ ఆనంద్ జైన్ మరియు  రవి బుద్ధానూరు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ మెంబర్షిప్ కన్వీనర్ శ్రీ ప్రమోద్ భగత్ గారు,  ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్  శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గారు,ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ కన్వీనర్ శ్రీ హరి సేథీ గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల , శ్రీ దీప్ భట్  గార్లు, , ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్  శ్రీ పార్తీబన్ వర్ధన్,సహా -కన్వీనర్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి మరియు ఇతర  ఓఎఫ్ బిజెపీ నేతలు ప్రదీప్ రెడ్డి, సందీప్ రెడ్డి గార్ల తో పటు  చాల మంది ప్రవాస భారతీయలు ఉత్సహంగా పాల్గొన్నారు.