జయంతి బిపిన్ చంద్రపాల్ : సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు

1492

జయంతి

బిపిన్ చంద్రపాల్ : సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు

07-11-1858వ సంవత్సరంలో నాటి బెంగాల్లోని (నేటి బంగ్లాదేశ్) సిల్హట్లో జన్మించారు.

వక్త రచయిత, ఉపాధ్యాయుడు, జర్నలిస్ట్ గా పేరొందిన బిపిన్ చంద్ర పాల్, గాంధీజి రాక కంటే ముందే బ్రిటీష్కి వ్యతిరేకంగా పోరాటం సాగించిన గొప్ప దేశభక్తుడు. చదువులో మంచి ప్రతిభ చూపకపోయినా పుస్తకాలు చదివి అపార జ్ఞానాన్ని సంపాదించారు. తన వాక్దాటితో ప్రజలను ప్రభావితులను చేసేవారు. బాల గంగాధర తిలక్, లాలాలజపతిరాయ్తో కలసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తీవ్రస్తాయి ఉద్యమాలు నడిపాడు.

బ్రిటీష్ వారి ఉత్పత్తులను నిషేధించడం, మాంచెస్టర్లో తయారైన వస్త్రాలను తగులబెట్టడం, బ్రిటీష్ వారు నడుపుతున్న పరిశ్రమలను మూయించడం వంటి పనులు చేసి ప్రజలలో బ్రిటీష్ వ్యతిరేకత ప్రొత్సహించడం చేత వీరి ముగ్గురిని లాల్ –పాల్ –బాల్ త్రయం అని పిలిచేవారు. ‘వందేమాతరం’ అనే పత్రికలో దేశభక్తి రగిల్చే వ్యాసాలు రాసేవారు పాల్.

Telugu Community News - LAL BAL PAL