ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) బతుకమ్మ సంబరాలు గణంగా నిర్వహించారు. డబ్లిన్‌లో 50 మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని నిర్వహించారు.
ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా 450 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ, దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి . మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు . ఇండియన్ అంబాసిడర్ శ్రీమతి రాధిక లాల్ లోకేష్ గారు ఈ వేడుకకు హాజరై అమ్మాయిలతో పాటు బతుకమ్మ ఆట ఆడారు . వచ్చిన అతిధులకు ప్రసాదం, రుచికరమైన వంటలు వడ్డించారు.