London -బతుకమ్మ – దసరా 2014 సంబరాలు

1679

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సంస్కృతిక శాఖ సహకారం తో, Telangana NRI Forum ఆధ్వర్యం లో లండన్ లో బంగారు బతుకమ్మ దసరా సంబరాలుఘనంగా నిర్వహించారు.

ఐసల్ వర్త్ & సయన్ స్కూల్ (Isleworth & Syon School) ఆడిటోరియం లోజరిగిన ఈ సంబరాలకు యుకేనలుమూలల నుండిసుమారు 800లకు పైగా తెలంగాణ కుటుంబ సబ్యులు హాజరైయ్యారు.

రంగు రంగుల బతుకమ్మలతోతెలంగాణ ఆడపడుచులు సందడిచేసారు, విదేశాల్లోఉన్నపటికీసంప్రదాయబద్దం గా పూజలు నిర్వహించి బతుకమ్మఆట ప్రారంభించారు, విదేశాల్లోస్థిరపడ్డా కానితెలంగాణఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరినిఆకట్టుకుంది, చిన్నారులు సైతం ఆట లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మ ల తో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు…బతుకమ్మలనినిమ్మజ్జనం చేసి.. తదుపరిసాంప్రదాయ బద్దం గా .సద్దుల ప్రసాదం ఇచ్చపుచ్చుకున్నారు. స్వదేశం నుండితెచ్చిన “జమిచెట్టు” కు ప్రత్యేక పూజలు చేసారు, ఇలా జమి చెట్టు తెచ్చిపూజ చెయ్యడం చాలా సంతోషంగా ఉందని,హాజరైనతెలంగాణా బిద్దలందరూ దీన్నిప్రశంసించారు. సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటినితల్పించందని పలువురుఅభిప్రాయపడ్డారు.

bathukamma-and-dasara-celebrations-in-london-grand-success (2) bathukamma-and-dasara-celebrations-in-london-grand-success (3) bathukamma-and-dasara-celebrations-in-london-grand-success (4)

ఫౌండర్ మెంబెర్ అనిల్ కుర్మచలం మాట్లాడుతూ ఈ సంవత్సరం బతుకమ్మ పండుగకు కు గొప్ప విశిష్టత ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినతరువాత జరుపుకుంటున్న మొదటి పండగ కావడం, అలాగే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సంస్కృతిక

శాఖ  సహకారం తో చేయడం చాల గౌరవం గ ఉంది అన్నారు. ఇందుకు అనుమతించి సహకరించిన ముఖ్యమంత్రి  శ్రీ . కలవకుంట్ల చంద్ర శేకర్ గారికి, ప్రభుత్వ కల్చరల్ సలహాదారులు  శ్రీ .K.V రమణ చారి గారికి, B.P. Acharya గారికి  ధన్యవాదాలు తెలిపినరు. తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రెసిడెంట్ సభ్యులు సీకా చంద్ర శేకర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం బతుకమ్మ పండుగకు కు గొప్ప విశిష్టత ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేసుకుంటున మొదటి బతుకమ్మ పండుగ కావున చాల ఆనందగా ఉంది మరియు ప్రభుత్వం బతుకమ్మసంబరాలు గణంగా గా నిర్వహించడం చాల హర్షనియం అని కొనియాడారు.

High Commission of India in London ప్రతినిది ప్రీతం లాల్ ఈ సందర్బము గ మాట్లాడుతూ TENF ఆవిర్భవించి నాటి నుంచి ఉనఅనుబందం గుర్తుకు చేసుకునారు ,TeNF తెలంగాణా రాష్ట్ర సాధనలో చేసిన సహాయ సహకారం మరియు ప్రవాస తెలంగాణా పౌరుల రాష్ట్ర సాధనలోఒతిడి తెలవడం లో TeNF పెద్ద పాత్రపోషించారు అన్ని అన్నారు .

 

ఇంకో ముక్య అతిధి గీత మోరల (మిల్టన్ కీన్స్ కోన్సుల్లోర్ ) మాట్లాడుతూ తెలంగాణా బిడ్డ గ ఇక్కడ ఒక ఆడ కూతురు గ బ్రిటిష్ గవర్నమెంట్ లోcounsellor గ చేయడం చాల గోప అనుబుతి అని ఇక్కడ ఉన తెలుగు తెలంగాణా బిడలకు తను సహాయంగా ఎప్పుడు ఉంటానని అన్నరు. తెలంగాణ కుటుంబాలు ఇలా ఒక్క దగ్గర కలుసుకొనిపండగ జరుపుకోవడం చాల సంతోషం గా ఉందనితెలిపారు. పిల్లలు మరియు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు చేఏర్పాటు చేసిన తెలంగాణా జానపదా నృత్యాలు అందరిని అలరించింది. అలాగే తెలంగాణా ఉద్యమం లో మరియు పలు సేవ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని సత్కరించారు.

ఉత్తమ బతుకమ్మ లకు బహుమతులు అందజేశారు ప్రధమ – శుశుమ్న reddy , ద్వితీయ – అర్చన – భవాని,  మరియు తృతీయ – కవిత గొలి అవార్డు గెలుచుకున్న వారిలో ఉన్నారు.

 

ఈ సందర్బముగా ఉదయ్ నాగరాజు ,మాట్లాడుతూ uk ముక్యంగా లండన్ లో ప్రవాస భారతీయుల కోసం పని చేసే అన్నిసంస్థలను ఒక తాటి పైకితీసుకొచ్చి అందరి తో కలిసి ప్రవాస భారతయులు శ్రేశ్సు కోసం పని చేసేలా మా వంతు కృషి చేస్తామని చేపినారు , ఇక్కడకు విచేసిన  ఇతర సంస్థలప్రతినితులకు అలాగే వారి సహకారానికి  అబినందలు తెలిపినారు.

 

TeNF కల్చరల్ -ఈవెంట్స్ఇంచార్జ్ప్ర ప్రమోద్ అంతటి , ఈవెంట్స్ సెక్రటరీ నగేష్ రెడ్డి మరియు అడ్వైసర్ ఉదయ నాగరాజు అద్వర్యం పవిత్ర రెడ్డి ,సీకాచంద్ర షేకర్ అద్యక్షతన జరిగిన ఈ కరిక్రమంలో ఫౌండర్ మెంబెర్ అనిల్ కుర్మచలం, ప్రధాన కార్యదర్శి సుమన్ బల్మూరి, మహిళా విభాఘం కో ఆర్డినేటర్ అర్చనజువ్వాడి తో పాటు సబ్యులు మీనాక్షి, నిర్మల, సుమా, వెంకట్ రెడ్డి,  జ్యోతి, స్వప్న షిండే  ,శ్రావని బల్మురి,శ్వేతా రెడ్డి ,ప్రవీణ్ రెడ్డి,గోలి తిరుపతి , అశోక్గౌడ్, స్రావాన్రెడ్డి, రంగు వెంకట్,విక్రం రెడ్డి, హరినవపేట్, మల్లా రెడ్డి, జితేందర్, సుధాకర్ గౌడ్ ,వెంకట్ చందనాల ,ఎలేందర్ ,గోలి సుమన్,ససిదర్,సుంధిప్.