అన్నమ్మయ్య కీర్తనల CD ఆవిష్కరణ on Nov 21st 2013 in Memphis

1102
అన్నమ్మయ్య కీర్తనల CD ఆవిష్కరణ
అన్నమ్మయ్య కీర్తనల CD ఆవిష్కరణ

మెంఫిస్, అమెరికా నవంబర్ 21:

హ్యూస్టన్ నగరానికి చెందిన అంతర్జాతీయ గాయని, ‘గాయక శిరోమణి’ మణిశాస్త్రి నిర్మాతగా, హైదరాబాద్ కు చెందిన ‘మధుర గాయక’ అంజనీ కృష్ణప్రసాద్ సంగీత దర్శకత్వం వహించి రూపొందించిన “అన్ని సింగారాలు నీకే” అన్నమయ్య కీర్తనలు CD ని , విశ్వ విఖ్యాత ఆధ్యాత్మికవేత్త విశ్వయోగి “విశ్వంజీ” టెన్నసీ రాష్ట్రంలోని మెంఫిస్ నగరం లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్క రించారు . ఈ సంధర్భంగా స్వామీజీ ప్రసంగిస్తూ ఇంతవరకు ప్రాచుర్యం పొందని అన్నమయ్య కీర్తనలు మణిశాస్త్రి, అంజనీ కృష్ణప్రసాద్ లు గానం చేసి రూపొందించటం అభినందనీయం అన్నారు. ఈ అన్నమయ్య కీర్తనలు అద్భుతంగా ఉన్నాయని, అందరు వినదగ్గవని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వేగేశ్న ఫౌండేషన్, హైదరాబాద్ మేనే జింగ్ ట్రస్టీ శిరోమణి వంశీ రామరాజు , అంజనీ కృష్ణప్రసాద్ , నాష్విల్ తెలుగు సంఘం అధ్యక్షురాలు “సేవాశిరోమణి” శ్రీమతి రేవతి మెట్టుకూరు, ఘంటసాల గాయకులు బాలకామేశ్వరరావు తాతా మరియు పలువురు పురప్రముఖులు పాల్గొన్నారు.

అన్నమ్మయ్య కీర్తనల CD ఆవిష్కరణ
అన్నమ్మయ్య కీర్తనల CD ఆవిష్కరణ