శాక్రమెంటో లో శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ కళాశాల హరికథ విభాగం అధిపతి డా ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి చే అన్నమయ్య హరికథ

1190

కాలిఫోర్నియా రాష్ట్రం లో శాక్రమెంటో శివారు నగరం మేతర్ లో నెలకొని ఉన్న స్వామి నారాయణ్ మందిర్ లో శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) ఆధ్వర్వం లో డా ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారి చే అన్నమయ్య హరికథ కార్యక్రమం ఘనం గా జరిగింది.

ముందుగా స్థానిక తెలుగు బాల బాలికలచే గణపతి ప్రార్ధనా గీతం తో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. తరువాత టాగ్స్ అధ్యక్షులు వెంకట్ నాగం మాట్లాడుతూ, తెలుగుహరికథకు అంతులేని ప్రాచుర్యాన్ని, కథకులకు మార్గానిర్దేశాన్ని చేసిన “హరికథా పితామహుడు” ఆదిభట్ల నారాయణదాసు అయితే వారికి ఉన్న ఉద్దండులైన శిష్య, ఉప శిష్యగణం లో డా ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు ఒకరు అని చెప్పారు. భారత ఉప రాష్ట్రపతి నుండి సంగీత నాటక అకాడెమీ అవార్డు తో పాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉగాది విశిష్ట పురస్కారం, కంచి కామకోటి పీఠం నుండి “ఆస్థానం విద్వాన్” పురస్కారం, ఆదిభట్ల నారాయణ దాసు ఆరాధనా సంఘం నుండి “హరికధ చూడామణి” బిరుదు, మరెన్నో పురస్కారాలు అందుకున్న డా ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు అన్నమయ్య హరికధ గానం కోసం ఇక్కడకు విచ్చేయ్యడం మనం చేసుకున్న అదృష్టం అని వెంకట్ నాగం నొక్కి చెప్పారు.

టాగ్స్ చైర్మన్ రాంబాబు బారివిసెట్టి, శ్రీ సింహాచల శాస్త్రి గారిని మెడలో పూల దండ తో అలంకృతం గావించారు. అనంతరం సింహాచల శాస్త్రి గారి చే అన్నమయ్య హరికథ ప్రారంభం అయ్యింది. అన్నమయ్య పుట్టుక నుండి, శ్రీ వెంకటేశ్వర స్వామి లో ఐక్యం అయ్యేంతవరకు ప్రతి ఘట్టాన్ని చక్కగా వర్ణించారు. హార్మోనియం తో పండిట్ బినయ్ పాథక్, తబలా తో రాహుల్ డియో సహకారం అందించారు. పిదప సింహాచల శాస్త్రి గారు మాట్లాడుతూ, సినిమా, నాటకం అభివృద్ధి కాక పూర్వం తెలుగు గడ్డ మీద ఇతర జానపద కళారూపాలతో పాటు ఎక్కువ ప్రజాదరణను పొందిన కళారూపాల్లో హరికథ చాల ముఖ్యమైంది, అనాటి నుంచి ఈనాటివరకూ శిధిలం కాకుండా నానాటికీ క్రొత్త రూపును సంత రించుకున్న కళారూపం మన తెలుగు హరికథ, కాబట్టి అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదన అయినటువంటి మన ఈ హరికధ కళా రూపాన్ని కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి టాగ్స్ చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరు తరలి రావడం చాలా సంతోషం అని చెప్పారు.

Annamayya Harikatha event in California Sacramento City (4) Annamayya Harikatha event in California Sacramento City (3) Annamayya Harikatha event in California Sacramento City (2) Annamayya Harikatha event in California Sacramento City (1)

రెండు గంటల పాటు జనరంజకంగా హరి కథను గానం తో పాటు, పిట్ట కథలతో, మధ్య మధ్య హాస్యరసాన్ని పోషిస్తూ, సమాజంలో వున్న లోపాలను ఎత్తి చూపిస్తూ, మన పిల్లలు అలవరచు కోవలసిన గుణాలను చెబుతూ, వేదాంత బోధ చేస్తూ, శాక్రమెంటో లో మొట్ట మొదటి సారిగా అన్నమయ్య హరి కథను గానం చేసిన సింహాచల శాస్త్రి గారికి టాగ్స్ కార్యవర్గం ఘనం గా సన్మానం గావించింది. ఈ కార్యక్రమం కు సహాయ సహకారాలు అందజేసిన 24 మంత్ర ఆర్గానిక్, కర్రీ బౌల్ రెస్టారంట్ రాక్లిన్, చికాగో ఇండియన్ పిజ్జా, శాక్రమెంటో ఆరాధనా కు టాగ్స్ చైర్మన్ రాంబాబు బారివిసెట్టి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టాగ్స్ భోజన సమన్వయకర్త దుర్గ చింతల ఆధ్వర్వం లో TAGS కార్యకర్తలు ఆహుతులకు భోజనం వడ్డించారు. కాలిఫోర్నియా శాక్రమెంటో లో హరికథ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు మనోహర్ మందాడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, అబ్దుల్ షైక్, దుర్గా చింతల, స్వర్ణ కంభంపాటి, కీర్తి సురం, అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, వాసు కుడుపూడి, భాస్కర్ దాచేపల్లి, వెంకట్ నాగం, TAGS కార్యకర్తలు తదితరులు ఉన్నారు.