అహుతి ప్రసాద్, గణేష్ పాత్రో కుటుంబాలకు నాట్స్ సంతాపం

1082

Ahuti Prasadganesh patro

 

 

 

 

 

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన వరుస విషాద వార్తలపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. క్యారెక్టర్ అర్టిస్టు ఆహుతి ప్రసాద్ ఆకస్మిక మరణంపై నాట్స్ తన సంతాపాన్ని ప్రకటించింది. తనకు ఏ పాత్ర ఇచ్చినా అందులో అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందిన నటుడు ఆహుతి ప్రసాద్ అని ఆయన మరణ వార్తతో తమంతా షాక్ కు గురయ్యామని నాట్స్ తెలపింది. 2009లో ఫ్లోరిడాలో జరిగిన నాట్స్ తెలుగు సంబరాలకు ఆహుతి ప్రసాద్ విచ్చేశారని.. ఆయనతో నాట్స్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.. ఆహుతి ప్రసాద్ కుటుంబ సభ్యులకు నాట్స్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. అహుతి ప్రసాద్ మరణవార్త నుంచి కోలుకోకముందే ప్రముఖ కథ, మాటల రచయిత గణేష్ పాత్రో ఈ లోకాన్ని విడిచివెళ్లి పోయారనే విషాద వార్త కూడా తమను ఎంతో కలిచి వేసిందని నాట్స్ ప్రకటించింది. ఆకలిరాజ్యం, రుద్రవీణ, మరోచరిత్ర లాంటి అలనాటి ఆణిముత్యాలతో పాటు నేటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వరకు దాదపు వందకుపైగా చిత్రాలకు మాటలు రాసిన గణేష్ పాత్రో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. తన పదునైన మాటలతో యువతరంలో చైతన్యం కూడా తీసుకొచ్చారు. అలాంటి మహారచయిత ఇక మనకు లేరనే విషయాన్ని తెలుసుకుని అమెరికా తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. గణేష్ పాత్రో కుటుంబ సభ్యులకు నాట్స్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది.