కెనడా లో తాకా 2019 సంక్రాంతి సంబరాలు

998

తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) రంగ రంగ వైభోగంగా సంక్రాంతి సంబరాలు, చింగస్కీ సెకండరీ స్కూల్, భ్రాంప్టెన్, కెనడా లో జనవరి 19, 2019 న జరుపు కొన్నారు. ఈ సంబరాలను -30 డిగ్రీల చలిలో కూడా తెలుగు వారందరు వచ్చి  వేడుకలను విజయవంతం చేసారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల ఆహ్వానించగా, కల్పనా మోటూరి, రజని లయం, ముంతాజ్ బేగం,సుష్మ, మరియు అర్చన గార్లు దీప ప్రజ్వలన చేయగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తాకా వారు కార్యక్రమానికి వచ్చిన చిన్నపిల్లలకు డైరెక్టర్స్ దీపా సాయిరామ్ మరియు వాణి జయంత్ భోగి పళ్ళ కార్యక్రమమును  మంగళ వాయిద్యాల మద్య ముత్తయిదుల చే ఆశీర్వదింప చేసారు. తాకా కార్యవర్గం సంక్రాంతి పండుగ మీద వ్యాస రచన పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

తాకా అద్యక్షులు శ్రీ అరుణ్ లయం గారు సంక్రాంతి  మరియు  తెలుగు సంస్కృతి  గురించి  సభికులను ఉద్దేశించి ప్రసంగించారు మరియు ఈ సంవత్సరపు దాతలను సభకు పరిచయం చేసారు. ఈ సంబరాలలో తాకా పూర్వ అద్యక్షులు శ్రీ చారి సామంతపూడి మరియు శ్రీ గంగాధర్ సుఖవాసి ప్రత్యేకంగా టొరోంటొ ఘడియలుతో చేపించబడిన  తెలుగు క్యాలెండర్నిఆవిష్కరించారు. ఈ సంబరాలలో  తాకా  సాంస్కృతిక కార్యదర్శి దీప సాయిరాం మరియు వాణి జయంత్ ఆధ్వర్యం లో దాదాపు 20  సాంస్కృతిక  కార్యక్రమాలు  తోటి  తెలుగు వారితో  నాటికలు, సినిమా డాన్సులు, పాటలు ఆరు గంటల పాటు ఎంతో ఉత్సాహమంతమైన వాతావరణం లో ప్రదర్శించ బడ్డాయి. అచ్చ తెలుగు వంటకాలు మరియు అరిసెలతో తాకా వారు భోజనాలని ఏర్పరిచారు.                                                              

ఎంతో అద్భుతంగా చేపట్టి మరియు విజయవంతం చేసిన ఫుడ్ కమిటీ శ్రీ సురేష్ కూన, సాంస్కృతిక కమిటి దీప సాయిరాం మరియు వాణి జయంత్, క్యాలెండర్ కమిటీ శ్రీ  గంగాధర్ సుఖవాసి మరియు ఉపాధ్యక్షులు దుగ్గిన రామచంద్రరావు , తాకా కోశాధికారి కల్పనా మోటూరిలను,రిజిస్ట్రేషన్ కమిటీ సభ్యుడు రాఘవ్ అల్లం లను   తాకా అద్యక్షులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇతర ట్రస్టీ సభ్యులు శ్రీబాషా షేక్, శ్రీ రాంబాబు కల్లూరిని, శ్రీ కిరణ్ కాకర్లపూడి, ఇతర వ్యవస్థాపక సభ్యులు శ్రీ శ్రీనాథ్ కుందూరు, శ్రీ రమేష్ మునుకుంట్ల గార్లు పాల్గొని కార్యవర్గానికి ఎంతో సహకరించారు. తాకా కమిటీలు ఈ సంక్రాంతి సంబరాలను  ఎంతో శ్రమకోర్చి కెనడా లోని  తెలుగు వారి కోసం  ఏర్పాటు చేసారు. చివరిగా అందరికి  ధన్యవాదాలు చెపుతూ జనగణమన  జాతీయ గీతంతో  కార్యక్రమాలు  ముగించారు.