కెనడా లో తాకా 2017 సంక్రాంతి సంబరాలు

1614

తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) రంగ రంగ వైభోగంగా సంక్రాంతి సంబరాలు, పోర్ట్ క్రెడిట్ సెకండరీ స్కూల్, మిస్స్సిసాగా, కెనడా లో జనవరి 21, 2017 న జరుపు కొన్నారు. ఈ సంబరాలలో దాదాపు 600 మంది తెలుగు వారు చలి వాతావరణము లో కూడా వచ్చి  వేడుకలను విజయవంతం చేసారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధి గా  ఆంటారియో  మంత్రి వర్యులు దీపికా దామెర్ల గారు విచ్ఛేసారు. తాకా సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి దీపా సాయిరాం ఆహ్వానించగా, శ్రీమతి లక్ష్మి దుగ్గిన, శ్రీమతి కాశీ అన్నపూర్ణేశ్వరి, శ్రీమతి జ్యోత్స్నా గోనేపల్లి, శ్రీమతి ముంతాజ్ భేగ్, మరియు శ్రీమతి ప్రమీల యరమాసు గార్లు దీప ప్రజ్వలన చేయగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తాకా వారు కార్యక్రమానికి వచ్చిన చిన్నపిల్లలకు డైరెక్టర్స్ దీపా సాయిరామ్ మరియు శ్రీమతి కల్పన మోటూరి గార్లు భోగి పళ్ళ కార్యక్రమమును  మంగళ వాయిద్యాల మద్య ముత్తయిదుల చే ఆశీర్వదింప చేసారు. తాకా కార్యవర్గం వివిధ రకమైన బొమ్మలతో ఆకర్షిణీయంగా బొమ్మల కొలువును ఏర్పరిచారు. ట్రస్టీ సభ్యులు శ్రీమతి మీనా ముల్పూరి ఆద్వర్యంలో తాకా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంబరాలలో  శ్రీ తాకా వ్యవస్థాపక చైర్మన్ శ్రీ రమేష్ మునుకుంట్ల  ముఖ్య అతిధి ని పరిచయము చేయగా, తాకా అద్యక్షులు శ్రీ చారి సామంతపూడి ప్రత్యేకంగా టొరోంటొ ఘడియలుతో చేపించబడిన  తెలుగు క్యాలెండర్ని ముఖ్య అతిధి దీపికా దామెర్ల తో ఆవిష్కరించారు.  ఈ సంబరాలలో  తాకా  సాంస్కృతిక కార్యదర్శి దీప సాయిరాం మరియు ట్రస్టీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లయం ఆధ్వర్యం లో దాదాపు 20  సాంస్కృతిక  కార్యక్రమాలు  తోటి  తెలుగు వారితో  నాటికలు, సినిమా డాన్సులు, పాటలు ఆరు గంటల పాటు ఎంతో ఉత్సాహమంతమైన వాతావరణం లో ప్రదర్శించ బడ్డాయి. అచ్చ తెలుగు వంటకాలు మరియు అరిసెలతో తాకా వారు భోజనాలని ఏర్పరిచారు.  శ్రీమతి అపర్ణ రామభోట్ల, మరియు యుతిక నల్లారి లు ఈ కార్యక్రమానికి  వ్యాఖ్యాతలు గా వ్యవహారించారు. తాకా అద్యక్షులు శ్రీ చారి సామంతపూడి గారు సంక్రాంతి  మరియు  తెలుగు సంస్కృతి  గురించి  సభికులను ఉద్దేశించి ప్రసంగించారు మరియు ఈ సంవత్సరపు దాతలను సభకు పరిచయం చేసారు. కెనడా లోని మనబడి తెలుగు చిన్నారులు మరియు యువతీ యువకులతో ప్రదర్శించబడిన పద్య నాటిక సతీ సావిత్రి, కాల యంత్రము, మరియు ఇతర భరత నాట్య నృత్య ప్రదర్శనలు మరియు ఎన్నో ఇతర కార్యక్రమాలు దాదాపు ఐదు గంటలు సేపు ప్రేక్షకులను ఉర్రూతలుగించాయి.

2017-taca-sankranthi-celebrations-in-canada-1 2017-taca-sankranthi-celebrations-in-canada-2 2017-taca-sankranthi-celebrations-in-canada-3 2017-taca-sankranthi-celebrations-in-canada-4 2017-taca-sankranthi-celebrations-in-canada-5 2017-taca-sankranthi-celebrations-in-canada-6 2017-taca-sankranthi-celebrations-in-canada-7 2017-taca-sankranthi-celebrations-in-canada-8 2017-taca-sankranthi-celebrations-in-canada-9 2017-taca-sankranthi-celebrations-in-canada-10

sank_13 2017-taca-sankranthi-celebrations-in-canada-11

తాకా వ్యవస్థాపక సభ్యులు శ్రీ గంగాధర్ సుఖవాసి ఆహ్వానించగా, తాకా అధ్యక్షులు మరియు కార్యవర్గం టొరంటో లోని, ప్రముఖ వేద పండితుడు మరియు ఎన్నో వందల మందికి ఉచితముగా వేద విద్య ను నేర్పిస్తున్న పండిట్ శ్రీ రమేష్ నటరాజన్ మరియు వారి సతీమణి శ్రీమతి  గాయత్రి  ఐయ్యర్ గార్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో వారి శిష్యులు శ్రీ వెన్నమనేని గంగాధర్, శ్రీమతి మీనా మూల్పూరి, శ్రీమతి వినోద, శ్రీమతి జ్యోతి, శ్రీమతి శశికళ ,శ్రీమతి భారతి, శ్రీమతి శాంతి,శ్రీమతి ఇందిర, మరియు ఇతరులు పాల్గొన్నారు.

 

 

ఎంతో అద్భుతంగా చేపట్టి మరియు విజయవంతం చేసిన ఫుడ్ కమిటీ శ్రీమతి కల్పన మోటూరి, ముగ్గుల పోటీల ఇంచార్జి ట్రస్టీ సభ్యులు శ్రీమతి మీనా ముల్పూరిని, సాంస్కృతిక కమిటి దీప సాయిరాం మరియు శ్రీ అరుణ్ కుమార్ ను, క్యాలెండర్ కమిటీ శ్రీ  గంగాధర్ సుఖవాసి మరియు ఉపాధ్యక్షులు శ్రీ బాచిన శ్రీనివాసు ను, తాకా కార్యదర్శి మరియు రిజిస్ట్రేషన్ కమిటీ శ్రీ లోకేష్ చిలకూరులను, స్టేజి కమిటీ కుమారి కీర్తి సుఖవాసి లను, తాకా అద్యక్షులుఅభినందించారు. ఈ కార్యక్రమంలో ఇతర ట్రస్టీ సభ్యులు శ్రీబాషా షేక్, శ్రీ వీరాంజనేయులు కోట ను, ఇతర వ్యవస్థాపక సభ్యులు శ్రీ శ్రీనాథ్ కుందూరు, శ్రీ మునాఫ్ అబ్దుల్, మరియు శ్రీ రామచంద్రరావు దుగ్గిన గార్లు పాల్గొని కార్యవర్గానికి ఎంతో సహకరించారు. తాకా కమిటీలు ఈ సంక్రాంతి సంబరాలను  ఎంతో శ్రమకోర్చి కెనడా లోని  తెలుగు వారి కోసం  ఏర్పాటు చేసారు. చివరిగా అందరికి  ధన్యవాదాలు చెపుతూ జనగణమన  జాతీయ గీతంతో  కార్యక్రమాలు  ముగించారు