కెనడా లో తాకా వారి దీపావళి వేడుకలు 2016

1325

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) వారి ఆధ్వర్యములో నవంబర్ 5వ తేదిన శనివారం మిస్సిసాగా నగరంలోని  పోర్ట్ క్రెడిట్ సెకండరీ స్కూల్ లో దీపావళి  వేడుకలు దాదాపు 1200 మంది తోటి తెలుగు వారి తో అంగ రంగ వైభవం గా జరిగాయి. ఈ వేడుక తాకా  సాంస్కృతిక కమిటీ శ్రీ  అరుణ్ కుమార్ లయం , శ్రీమతి దీప సాయిరాం ఆద్వర్యం లో అచ్చ తెనుగు సాంప్రదాయ పద్ధతులతో దాదాపు 6 గంటలు పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల తో సభికులను అలరించాయి.  కీర్తి సుఖవాసి, టీనా సామంతపూడి,మరియు పూజిత బెజుగామ లు వ్యాఖ్యాతలు గా వ్యవహరించారు. ఈ కార్యక్రమం లో టొరంటో లో వ్యాపారం చేస్తున్న తెలుగు వారు  దాదాపు 25 స్టాల్స్ ను ప్రదర్శించారు.  ఈ కార్యక్రమాన్ని డెస్ జార్డీన్స్ ఇన్సూరెన్స్ సంస్థ ముఖ్యంగా పోషక కర్తగా వ్యవహరించింది.

 

తాకా కార్యదర్శి శ్రీ లోకేష్ చిల్లకూరు గారు ఆహ్వానించగా,  శ్రీమతి జ్యోతి సామంతపూడి, శ్రీమతి మీనా ముల్పూరి, శ్రీమతి వినోద బాచిన, శ్రీమతి దీప సాయిరాం మరియు శ్రీమతి కల్పనా గార్లు జ్యోతి ప్రజ్వలన చేయగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉగాది వేడుకలలో దాదాపు వందకి పైగా టొరంటోలో నివసిస్తున్న చిన్నారులు, యువత మరియు పెద్దలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు . ఈ  కార్యక్రమానికి సిలికానాంధ్ర మనబడి గ్లోబల్ లీడ్ శ్రీ శరత్ వేట గారు అతిధిగా హజరయ్యరు. తాకా వ్యవస్థాపక చైర్మన్ శ్రీ రమేష్ మునుకుంట్ల, వ్యవస్థాపక సభ్యులు శ్రీ గంగాధర సుఖవాసి మరియు ట్రస్ట్ చైర్మన్ శ్రీ అరుణ్ లయం గార్లు శ్రీ శరత్ గారిని సత్కరించారు.

2016-taca-diwali-celebrations-in-canada-1 2016-taca-diwali-celebrations-in-canada-2 2016-taca-diwali-celebrations-in-canada-3

తాకా అద్యక్షులు  శ్రీ చారి సామంతపూడి గారు తాకా వ్యవస్థాపకతను వివరిస్తూ, కెనడా లోని తెలుగువారి ఖ్యాతిని నలుమూలలా విస్తరణకు దోహదపడే తెలుగు బాష , సాంస్కృతిక, సాంఘిక, ఉద్యోగ, వ్యాపార మరియు ఇతర కార్యక్రమాల తోడ్పాటుకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కెనడా లోని తెలుగు వారంతా సంఘటితమై ఒకరినొకరు సహాయం చేసుకుంటూ అన్ని రంగాలలో అందరికంటే ముందు ఉండాలని విజ్ఞప్తి చేసారు. టొరంటో మనబడి వారి భక్త ప్రహ్లాద నాటకము, డాన్స్ మంత్రా వారి నృత్యాలు, సురేష్, ధీరజ్ మరియు సంధ్య వారి సుస్వర ధ్వని గానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

 

తాకా అద్యక్షులు  శ్రీ చారి సామంతపూడి, మరియు తాకా ట్రస్టీ చైర్మన్ శ్రీ  అరుణ్ కుమార్ లయం గార్లు టొరంటోలో శ్రీమతి  లక్ష్మీ రాయవరపు ఆధ్వర్యము లో నడుప  బోతున్న తెలుగు తల్లి పత్రిక ను మరియు సంఘ సేవకుడు శ్రీ అప్పారావు గారి రచించిన పాట “అందరూ బాగుండాలి ” ని  ఈ వేడుకలలో విడుదల చేసి ప్రతులు పంచారు,మరియు ముఖ్య పోషకులు ప్రసాద్ ఓడూరి ని మెమెంటో తో బహుకరించారు. .

 

తాకా ట్రస్టీ సభ్యులు శ్రీమతి మీనా ముల్పూరి, డైరెక్టర్లు శ్రీమతి కల్పన, శ్రీమతి దీప సాయిరాం, ఉపాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ బాచిన మరియు పుర ప్రముఖులు శ్రీ లక్ష్మీనారాయ సూరపనేని గార్లు  సాంస్కృతిక కార్యక్రమాల లో పాల్గొన్న వారికి, వారికీ బహుమతులు అంద చేసారు.  తాకా వారు ప్రత్యేకంగా తయారు చేపించిన పిండివంటలతో దీపావళి  విందుని ఏర్పాటు చేసారు.

2016-taca-diwali-celebrations-in-canada-4 2016-taca-diwali-celebrations-in-canada-5 2016-taca-diwali-celebrations-in-canada-6

ఈ వేడుకను ఎంతో అద్భుతం గా చేపట్టి మరియు విజయవంతము చేసిన తాకా కోశాధికారి శ్రీ భానుప్రకాష్ పోతకమూరిని , ఫుడ్ కమిటీ ఇంచార్జి శ్రీమతి కల్పనా మోటూరి మరియు శ్రీనివాస్ బాచిన ని , కల్చరల్ ఇంచార్జి శ్రీమతి దీప సాయిరాంని, స్టేజి కమిటీ ఇంచార్జి  శ్రీ లోకేష్ చిల్లకూరు ని, వాలంటీర్ ఇంచార్జి శ్రీ నాగేంద్ర హంసాల మరియు కీర్తి సుఖవాసి ని, ట్రస్టీ సభ్యులు శ్రీ బాషా గారు, వీరాంజనేయులు కోట ను తాకా అద్యక్షులు అభినందించారు. తాకా ఇతర వ్యవస్థాపక సభ్యులు శ్రీ గంగాధర్ సుఖవాసి,శ్రీ రామచంద్రరావు దుగ్గిన, శ్రీ శ్రీనాథ్ కుందూరు, శ్రీ రవి వారణాసి, శ్రీ మునాఫ్ అబ్దుల్, శ్రీ రాకేష్ గరికపాటి లు ఈ వేడుక విజయవంతానికి ఎంతో సహకరించారు.

2016-taca-diwali-celebrations-in-canada-7 2016-taca-diwali-celebrations-in-canada-8 2016-taca-diwali-celebrations-in-canada-9

ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వినేష్, ప్రత్యూష, లోకేష్ , శివ కుమార్,లక్ష్మీనాథ్, మానస పండేటి, మానస ఆలపాటి, వైష్ణవి, ప్రవీణ్, మేఘన,రిషి, ఆశీష్, భార్గవశర్మ, రాంబాబు, హరి, రఘులు  ముందుకు వఛ్చి సేవలందించారు. చివరిగా కొత్తగా చేరిన సభ్యులకు, సేవకులకు, స్పాన్సర్స్ కు మరియు అందరికి ధన్యవాదాలు చెపుతూ జనగణమన జాతీయగీతంతో కార్యక్రమాన్ని ముగించారు.