కెనడా లో తాకా వారి 2016 క్రిస్మస్ వేడుకలు

1228

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) వారి ఆధ్వర్యములో డిసెంబర్ 18 తేదిన ఆదివారం మార్ఖం కమ్యూనిటీ సెంటర్ లో క్రిస్మస్ వేడుకలు తోటి తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ తో జరిగాయి. ఈ వేడుకలను జార్జ్ పువ్వాడ మరియు సుధీర్ వార్ల సహకారము తో క్రిస్మస్ గాస్పెల్స్, కారల్స్ మరియు పాస్టర్ల సందేశాలతో జరప పడ్డాయి. తాకా అద్యక్షులు  శ్రీ చారి సామంతపూడి గారు తాకా అన్ని మతాలూ, ప్రాంతాలకు అతీతంగా స్థాపించబడిందని, అన్ని పండుగల వేడుకలను తాకా జరుపుతుందని, అందరిని కలుపుకొని తెలుగు వారి ఉన్నతికి పాటుపడుతుందని సందేశం ఇచ్చ్చారు. కెనడా లోని తెలుగు వారంతా సంఘటితమై ఒకరినొకరు సహాయం చేసుకుంటూ అన్ని రంగాలలో అందరికంటే ముందు ఉండాలని విజ్ఞప్తి చేసారు.

 

ఈ కార్యక్రమాన్ని తాకా ఫౌండర్స్ చైర్మన్ శ్రీ రమేష్ మునుకుంట్ల, వ్యవస్థాపక సభ్యులు శ్రీ గంగాధర్ సుఖవాసి,శ్రీ రామచంద్రరావు దుగ్గిన, ట్రస్టీ సభ్యులు శ్రీ బాషా షేక్, శ్రీమతి మీనా ముల్పూరి, శ్రీ వీరాంజనేయులు కోట, ఉపాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ బాచిన,  కోశాధికారి శ్రీ భానుప్రకాష్ పోతకమూరి, డైరెక్టర్ శ్రీమతి కల్పనా మోటూరి, యూత్ డైరెక్టర్ కుమారి శ్రావణి దుగ్గిన గార్లు హాజరై పర్యవేక్షించారు. ట్రస్టీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లయం, డైరెక్టర్ నాగేంద్ర హంసాల,యూత్ డైరెక్టర్ కీర్తి సుఖవాసి ఈ కార్యక్రమ విజయానికి కృషి చేసారు. కార్యక్రమ అనంతరం క్రిస్మస్ డిన్నర్ ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వఛ్చి సేవలందించిన మల్లికార్జున్,వినోద మరియు అందరిని అభినందించారు.

 

2016-christmas-celebrations-by-taca-in-canada-1 2016-christmas-celebrations-by-taca-in-canada-2 2016-christmas-celebrations-by-taca-in-canada-3 2016-christmas-celebrations-by-taca-in-canada-4 2016-christmas-celebrations-by-taca-in-canada-5 2016-christmas-celebrations-by-taca-in-canada-6 2016-christmas-celebrations-by-taca-in-canada-7