నాటాకు నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ 2015

1471

నాటా నూతన ఎగ్గిక్యూటివ్ కమిటీ కొలువు దీరింది. లాస్ వెగాస్, నెవడాల్లో జనవరి 9 నుంచి 11 వరకు విజయవంతంగా నిర్వహించిన వార్షిక బోర్డు మీటింగుల్లో కొత్త కమిటీలను ఎన్నుకున్నారు. నాటా సలహా మండలి అధ్యక్షుడు డాక్టర్ ప్రేమ్ రెడ్డి ప్రారంభోపన్యాసంతో ఈ సమావేశాలు మొదలుకాగా ఏసీ సభ్యుడు డాక్లర్ మల్లారెడ్డి, డాక్టర్ ఎం.ఎస్.రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితరులు మాట్లాడారు. 2013-14 మధ్య అధ్యక్షుడిగా పనిచేసిన నాటా పూర్వ అధ్యక్షుడు డాక్టర్ సంజీవ రెడ్డి సాధించిన విజయాలను వక్తలు కొనియాడారు. 2014 అట్లాంటా కన్వెన్షన్ ను విజయవంతంగా నిర్వహించిన కన్వెన్షన్ కమిటీని కూడా వక్తలు ప్రశంసించారు.

 2015 NATA new executive committee

అనంతరం పూర్వ అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి కొత్త అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం కు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ మల్లం మాట్లాడుతూ… మరిన్ని సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, క్రీడాపోటీలు నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తానని, మెంబర్ షిప్ డైరెక్టరీని కూడా త్వరలోనే ప్రచురిస్తామని వెల్లడించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొత్త బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

2015-16 సంవత్సరానికి నూతన ఎగ్గిక్యూటివ్ కమిటీ..
ప్రెసిడెంట్: డాక్టర్ మోహన్ మల్లం
ప్రెసిడెంట్ ఎలక్ట్ : రాజేశ్వర్ గంగసాని
ఎగ్గిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: డాక్టర్ రాఘవరెడ్డి ఘోసల
కార్యదర్శి: గిరీశ్ రామిరెడ్డి
కోశాధికారి: హరినాథ్ వెల్కూర్
సంయుక్త కార్యదర్శి: శ్రీనివాస్ గనగోని
సంయుక్త కార్యదర్శి: భరత్ రెడ్డి మాదాడి
కార్యనిర్వాహక సంచాలకుడు(ఎగ్గిక్యూటివ్ డైరెక్టర్): రామి అల్లా రెడ్డి
అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు(ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్): జయచంద్రారెడ్డి
అంతర్జాతీయ సమావేశాల సలహాదారు(నేషనల్ కన్వెన్షన్ అడ్వయిజర్): ప్రదీప్ సామల

బోర్డు ఆఫ్ డైరెక్టర్లు
అన్నారెడ్డి, భరత్ మాదాడి, గిరీశ్ రామిరెడ్డి, హరనాథ్ పొలిచెర్ల, హరి వెల్కూర్, మహేందర్ ముసుకు, మల్లిక్ బండ, మోహన్ మల్లం, మోహన్ పట్లోల్ల, మోహన్ రెడ్డి తలమాటి, రాఘరరెడ్డి ఘోసల, రాజేశ్వర్ రెడ్డి గంగసాని, రమేశ్ చంద్ర, రామి అల్లారెడ్డి, రామిరెడ్డి బుచ్చిపూడి, సాంబ రెడ్డి, సంతోష్ రెడ్డి, పాతూరి, శివ మేకా, శ్రీనివాసుల రెడ్డి కొట్టూరె, శ్రీనివాసులరెడ్డి సోమవరపు, శ్రీకాంత్ రెడ్డి పెనుమాడ, శ్రీనిరెడ్డి వంగమల్ల, శ్రీనివాస్ గనగోని, శ్రీనివాసరెడ్డి అల్ల, స్తాన్లీ రెడ్డి, శ్యామరెడ్డి, వెంకటరమణా రెడ్డి మురారి, వెంకటరామిరెడ్డి శనివరపు, విష్ణు కోటిమరెడ్డి.

కాగా, టెక్సాస్, డల్లాస్ లో 2016లో నిర్వహించనున్న సమావేశాలకు సమన్వయాధికారి(కన్వీనర్)గా డాక్టర్ రమణా రెడ్డి గూడూరును.. సమన్వయకర్త(కో ఆర్డినేటర్)గా రామసూర్యారెడ్డిని నూతన బోర్డు ఎంపిక చేసింది.