దుబాయ్ లో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలకటానికి తెలుగు లోగిళ్ళు ఎంత శోభాయమానంగా వెలుగులు నింపుకుంటాయో అంత శోభాయమానంగా దుబాయ్ లోని తెలుగువారు జరుపుకున్న సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రముఖ తెలుగు అసోసియేషన్ ‘వేవ్ రెసోనన్స్’ అధ్వర్యంలో శుక్రవారం దుబాయ్ లోని మంజార్ పార్క్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు సంక్రాంతి సంబరాలు జరిగాయి. సుమారు 700 తెలుగు కుటుంబాలు సంక్రాంతి సంబరాలలో పాల్గొని పండుగకు కొత్త శోభను తెచ్చారు. శ్రీమతి లక్ష్మి కామేశ్వరి గారి స్వాగత గీతం ఆలపించగా ‘వేవ్ రెసోనన్స్’వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి గీతా రమేష్ సంబరాల్ని అందరి హర్షద్వానాల మధ్య ప్రారంబించారు.

Wave Resonance Sankranthi Celebrations in Dubai (1) Wave Resonance Sankranthi Celebrations in Dubai (2) Wave Resonance Sankranthi Celebrations in Dubai (3) Wave Resonance Sankranthi Celebrations in Dubai (4) Wave Resonance Sankranthi Celebrations in Dubai (5)