*** ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది.: వెంకయ్య నాయుడు  *** తెలుగు కుటుంబం మేలు గురించి ఆలోచించాలని వెంకయ్య పిలుపు ***
జూలై 4:  లాస్ ఏంజెల్స్: అనహమ్ కన్వెన్షన్ సెంటర్:  ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా తెలుగు కుటుంబం మేలు గురించి యావత్ తెలుగువారంతా ఆలోచించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు  పిలుపునిచ్చారు. అమెరికాలో అద్భుత విజయాలు సాధిస్తున్న తెలుగువారు.. తమ జన్మభూమి ప్రగతిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ లాస్ ఏంజిల్స్ లో నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాల్లో  వెంకయ్యనాయుడు తెలుగువారిలో ఉత్సాహాన్ని నింపేలా ప్రసంగించారు. ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే అనేది మరిచిపోవద్దని హితవు పలికారు. తెలుగువారు ఎక్కడున్నా ఒక్కటిగా ముందడుగు వేసి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. మొట్టమొదటగా తెలుగు వారందరికీ అమెరికా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేసారు. యావత్ ప్రపంచం ఇప్పుడు మోడీ ప్రభావంతో భారత్ వైపు చూస్తోందన్నారు. ప్రవాస భారతీయులు కూడా ఇప్పుడు స్వదేశం వైపు చూడాలని అక్కడ పెట్టుబడులు పెట్టాలన్నారు.  నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసిన వెంకయ్యనాయుడు తన ప్రసంగం ద్వారా తెలుగువారిలో స్ఫూర్తిని నింపారు. నాట్స్ నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు..
DSC_0718 DSC_0744 DSC_0745 DSC_0747 DSC_0754 DSC_0756 DSC_0799 DSC_0850 DSC_0850_1 DSC_0855 DSC_0871