వ్యాలీ తెలుగుస్ తొలి ఉగాది వేడుకలు మార్చ్ 21వ తేదీన సాన్ఫెర్నాన్డొ వ్యాలీ లోని వెస్ట్ హిల్స్ జ్యూయిష్ కమ్యూనిటీ హై స్కూల్ లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వ్యాలీలో తెలుగు వారి నుండి విశేష స్పందన లబించింది. సుమారు 500 మంది ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. 75 మంది కళాకరులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. చిన్నారులు తమ శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, సాంప్రదాయ తెలుగు గీతాలు, టాలివుడ్ డాన్సులతో ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమం సాయంకాలం 6:00 గంటలకు ప్రారంబమై 10:30 కి ముగిసింది. ఈ సందర్బం గా ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి పోటీ కి విశేష స్పందన లబించింది. ఉగాది పచ్చడి విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందచేశారు. Valley Telugu Ugadi celebrations in Los Angeles (1) Valley Telugu Ugadi celebrations in Los Angeles (2) Valley Telugu Ugadi celebrations in Los Angeles (3) Valley Telugu Ugadi celebrations in Los Angeles ఈ కార్యక్రమంలో ముఖ్యముగా పంచాంగ శ్రవనమ్ అందరినీ ఆకట్టుకుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో వారి వారి రాసి ఫలాలు ఆలకించారు. అలాగే చిన్నారులు చేసిన టాలివుడ్ డాన్సులు అందరినీ మంత్ర ముగ్దుల్ని చేశాయి. వ్యాలీ మహిళలు పిల్లలతో కలసి చేసిన ఫ్యాషన్ షో కార్యక్రమం ఎంతో   ఆకర్షణ గా నిలిచింది. చివరిలో పసిఫిక్ రిథం వారి సంగీత లహరి అందరినీ ఆకట్టుకుంది.   ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి కృషి   చేసిన అందరికి వ్యాలీ తెలుగుస్ దన్యవాదాలు తెలియచేసింది.   లోకల్ టాలెంట్ తో ఈ కార్యక్రమాన్ని అత్యద్బుతమ్ గా తీర్చి దిద్దటం లో నిర్వాహక కమిటీ విజయం సాదించింది. సాంస్కృతిక కారాయక్రమంలో పాల్గొన అందరికి ట్రోఫీ లు అందచేశారు. Photo Links: https://plus.google.com/photos/109207652764061015011/albums/6129327737138760033 https://plus.google.com/photos/109207652764061015011/albums/6129517099713454801 https://plus.google.com/u/0/photos/109207652764061015011/albums/6130056786079501793