మస్కట్ , బహరేన్ లో ఘనంగా తెలంగాణా రాష్ట్ర ఆవతరణ సంబరాలు.
బహరేన్  :
బహరేన్ లో ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ అధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణా అమరవీరులకు క్రోవ్వత్తులు వెలిగించి వారికి నివాళ్ళు అర్పించి వారి వీర త్యాగాలను స్మరించుకున్నారు.మనామా సెంట్రల్ బస్టాండ్ లో ప్రయాణికులకు పండ్లు మరియు వాటర్ బాటిళ్ళు పంపిణి చేసారు.వాటర్ గార్డెన్లో కేకును కట్ చేసి ఆనందోత్సాలతో ఆవతరణ వేడుకలు జరుపుకున్నారు .ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ గల్ఫ్ కో-ఆర్డినేటర్ రాధారపు సతీష్ కుమార్, ఇంచార్జ్ బోలిశెట్టి వెంకటేష్ లు మాట్లాడుతూ బహరేన్ లో తెలంగాణా రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలు రెండోవ సారి కూడా ఇక్కడే జరుపుకుంటున్నందుకు సంతోషంగా వుంది.అమరవీరుల త్యాగఫలం తో,కెసిఆర్ గారి సారథ్యం తో,ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరుణంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆభివృద్ధి పనులు,సంక్షేమ కార్యక్రమాలు ,మిషన్ కాకతీయ,భగిరథలు , ఇలా అనేక రంగాలలో విజయపథం లో దుసూకేల్తు తెలంగాణా రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది .తెలంగాణా రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై పరిచయం చేయడానికి మా వంతు బాధ్యతతో కృషి చేస్తున్నాం.తెలంగాణా ఉద్యమంలో ఎన్నారై ల పాత్ర ఎనలేనిదని ఇక్కడ జరిగిన ఉద్యమానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో  ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ గల్ఫ్ కో-ఆర్డినేటర్ రాధారపు సతీష్ కుమార్, ఇంచార్జ్ బోలిశెట్టి వెంకటేష్,  నాయకులూ ప్రశాంత్,బద్రి,రాజేశ్వర్ గౌడ్,సుమన్,డా”రవి,గంగన్న,రవి దేశెట్టి,రాజు,గంగాధర్ నర్సయ్య,తిరుపతి,శ్రీనివాస్,ప్రకాష్,శంకర్,రాజేష్,సుధాకర్,వినోద్,సదానంద్,బుచ్చి రెడ్డి,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
B (1) B (3) Bahrain Muscat
మస్కట్ : 
మస్కట్ లో ఎన్నారై టి.ఆర్.ఎస్.ఆధ్వర్యంలో తెలంగాణా రెండవ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ కో-ఆర్డినేటర్ అడువాల శంకర్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కొత్త కొత్త పథకాలతో ముందుకేల్తు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారు.ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు కెసిఆర్ గారి బంగారు తెలంగాణా సాధనకై అందరు తమవంతు కృషి చేయాలనీ ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మస్కట్ ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ కో-ఆర్డినేటర్ అడువాల శంకర్,  ఎన్నారై టి.ఆర్.ఎస్.నాయకులూ శ్రీనివాస్,లక్ష్మన్,కబీర్,మహిపాల్,మన్ సుర్,తిరుపతి,అల్లమోద్దిన్,సయ్యద్,సత్తయ్య,చంద్రయ్య,రాజయ్య,లు పాల్గొన్నారు.