కెనడాలో ఘనంగా తెలంగాణ ప్రకాశ్ పుస్తకావిస్కరణ చరిత్ర అధ్యయనంతోనే బంగారు తెలంగాణ నిర్మాణం త్వరితగతిలో సాకారమని పిలుపు   కెనడా లోని మిస్సిస్సౌగా నగరంలోని మాల్టన్ కమ్మునిటి లైబ్రరీ హాలులో తేది 17 జూలై 2016 ఆదివారం సాయంత్రం 7 గంటలకు దాదాపు తెలంగాణ వాసులతో "తెలంగాణ ఉద్యమాల చరిత్ర" ఇంగ్లీష్ వెర్షన్ “History of Telangana Movements” పుస్తకమును శ్రీ కైరోజు సీతారాములు, శ్రీ తిరుమలాపురం పెంటయ్య, శ్రీ నేరెల్లపల్లి మహేందర్ రెడ్డి, శ్రీ రాం రెడ్డి మరియు శ్రీ గడ్డం రామేశ్వర్ రెడ్డి గారలు పుస్తక రచయిత శ్రీ వీరమల్ల ప్రకాశ్ గారి సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శ్రీ వీరమల్ల ప్రకాశ్ గారు సభికులను ఉద్దేసించి మాత్లాడుతూ తెలంగాణ సమగ్ర చరిత్ర అద్యయనంతో బంగారు తెలంగాణ సాదించుకోవచ్చని, గతపాలకులు తెలంగాణ పట్ల చూపిన వివక్ష వలన ప్రజలకు జరిగిన అన్యాయలను సమగ్రంగా చదివి తెలుసుకొని పరిపూర్నమైన అవగాహనతో పతకాలను రూపొందించుకున్నప్పుడే ప్రజలు కోరుకుంటున్న బంగారు తెలంగాణ త్వరితగతిలో సాదించుకొనుట సాద్యమని తెలిపారు. ప్రవాస తెలంగాణ వారందరు బంగారు తెలంగాణ నిర్మాణములో పాల్గొని వారి సూచనలను, వ్రుత్తి పరమైన నైపున్యాన్ని, సలహాలను  ఎప్పటికప్పుడు అందించాలని ఈ సందర్బంగా కెనడాలోని తెలంగాణ వాసులకు శ్రీ ప్రకాశ్ గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం "తెలంగాణా కెనడా అసోసియేషన్" Telangana Canada Association (TCA) ఆధ్వైర్యంలో జరుగగా ఫౌండర్  శ్రీ రమేశ్ మునుకుంట్ల మొత్తం కార్యక్రమనికి అధ్యక్షత వహించారు, అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారు, ట్రస్టీ చైర్ శ్రీ అఖిలేష్ బెజ్జంకి మరియు  FC చైర్ శ్రీ శ్రీనాథ్ రెడ్డి కుందూరి గారలు ప్రసంగిచారు మరియు తెలంగాణ IT అసోషియేషన్ కార్యక్రమాలను శ్రీ రంజిత్ విషదీకరించారు. ఈ కార్యక్రమంలో దాదపు నూరు మంది తెలంగాణ వాసులతో పాటు  "తెలంగాణా కెనడా అసోసియేషన్ (TCA)" ఉపాధ్యక్షులు శ్రీ కోటెశ్వర్ రావు, కోషాధికారి శ్రీ దేవెందర్ రెడ్డి గుజ్జుల, ఉప కోషాధికారి శ్రీ శంతన్ రెడ్ది నేరెల్లపల్లి , డైరక్టర్లు శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ సమ్మయ్య వాసం, శ్రీ విజయకుమార్ తిరుమలాపురం, శ్రీమతి రాధిక బెజ్జంకి, ట్రస్టీ శ్రీమతి శీరీష స్వర్గం, శ్రీ సంపత్ బాలమోని మరియు తెలుగు అసోషియేషన్ మాజీ అధ్యక్షులు మునాఫ్ అబ్దుల్ గారలు పాల్గొన్నారు. telanagana prakas book release in canada (1) telanagana prakas book release in canada (2) telanagana prakas book release in canada (3) telanagana prakas book release in canada (4) telanagana prakas book release in canada (5) ఈ సందర్భంగా తెలంగాణ కెనడా అసోషియేషన్ వారు శ్రీ ప్రకాశ్ గారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందచేసారు. ఆఖరున ఉపాధ్యక్షులు శ్రీ కొటేశ్వర రావు గారి వందన సమర్పనతో కార్యక్రమాన్ని ముగించారు